BREAKING
వెల్దుర్తి మండలంలో మొత్తం 17 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. వాటి వివరాలు మరియు రిజర్వేషన్లు: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ పంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు స్థానిక షెడ్యూల్ వచ్చేసింది.. గాయత్రీ దేవిగా దర్శనమిచ్చిన బాల త్రిపుర సుందరీ దేవి నాలుగో రోజు దుర్గామాతకు పూజలు అద్దంకి విద్యుత్తు ఈఈ మస్తాన్ రావుకు SE గా పదోన్నతి రేణిగుంట ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు ఎమ్.పి.టీ.సి ఎన్నికలకు రిజర్వేషన్ ఖరారు గడువు లోపు రైతులు ఈ కీవైసీ పూర్తి చేసుకోవాలి. శేషంపల్లిలో ఆరోగ్య రథం సేవలు.. ఈవీఎం గోదాముల భద్రతలో అలసత్వానికి తావు లేదు- నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా సర్దుబాటుపై కుస్తీపట్లు హింసకు తావులేకుండా భక్తితో బన్నీ ఉత్సవాలు జరగాలి: ప్లాన్లో కృష్ణ లీలలు... కబ్జాకు విజయ మార్గం!

వికారాబాద్ జిల్లాలో ఆయుష్ శాఖలో 8 అవుట్‌సోర్సింగ్ పోస్టులు: కలెక్టర్ దీపక్ తివారి

Select Suryaa Now
వికారాబాద్ జిల్లాలో ఆయుష్ శాఖలో 8 అవుట్‌సోర్సింగ్ పోస్టులు: కలెక్టర్ దీపక్ తివారి

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్ (అక్టోబర్ 14): జాతీయ ఆయుష్ మిషన్ (NAM) పథకం కింద వికారాబాద్ జిల్లాలో ఆయుష్ శాఖలో ఖాళీగా ఉన్న 8 అవుట్‌సోర్సింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 14 నుంచి 24వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.జిల్లాలో ఆయుష్ మెడికల్ ఆఫీసర్ (పోస్ట్ గ్రాడ్యుయేట్) ఒక పోస్టు, ఆయుష్ మెడికల్ ఆఫీసర్ రెండు పోస్టులు, డైటీషియన్ ఒక పోస్టు, సైకోసోషియల్ కౌన్సిలర్ ఒక పోస్టు, యోగా ప్రొఫెషనల్ ఒక పోస్టు, మల్టీ పర్పస్ వర్కర్ రెండు పోస్టులు కలిపి మొత్తం 8 ఖాళీలు ఉన్నట్లు కలెక్టర్ వెల్లడించారు.అర్హత కలిగిన అభ్యర్థులు నిర్దేశిత దరఖాస్తు ఫారంతో పాటు విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు, అనుభవ ధ్రువీకరణ పత్రాలు, ఇతర అవసరమైన పత్రాలను జతచేసి గడువులోగా సమర్పించాలని సూచించారు. దరఖాస్తులను అన్ని పని దినాల్లో జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు.దరఖాస్తు ఫారాలు, పూర్తి వివరాలను వికారాబాద్ జిల్లా అధికారిక వెబ్‌సైట్ vikarabad.telangana.gov.in ద్వారా పొందవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.