శేషంపల్లిలో ఆరోగ్య రథం సేవలు..
మధుసూదన్ గౌడ్ రామగిరి సూర్య: శేషంపల్లిలో ఆరోగ్య రథం.. 40 రకాల వైద్య పరీక్షలు ఉచితం..
రామగిరి మేజర్ న్యూస్ : గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలను చేరువ చేయాలనే లక్ష్యంతో ప్రారంభించిన ఆరోగ్య రథం సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వైద్య సిబ్బంది, టీడీపీ నాయకులు పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ప్రారంభించిన ఈ ఆరోగ్య రథం ద్వారా నెలకు ఒకసారి ప్రతి పంచాయతీలో వైద్య సేవలు అందించనున్నారు. ఇందులో భాగంగా బుధవారం రామగిరి మండల పరిధిలోని శేషంపల్లి గ్రామానికి ఆరోగ్య రథం చేరుకుంది ఆరోగ్య రథం ద్వారా సుమారు 40 రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాప్తాడు శాసనసభ్యురాలు పరిటాల సునీత ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మజ్జిగ ఆంజనేయులు సునీత,వడ్డీ కాటిమయ్య, బోయ కుళ్లాయప్ప, మజ్జిగ మారెప్ప, చిదగొండ్ల మారెప్ప, ఎం. ఆంజనేయులు తదితర గ్రామ నాయకులు, గ్రామస్తులు, వైద్య సిబ్బంది, ఎంఎల్హెచ్పీలు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు