BREAKING
ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్న స్ట్రీట్ ఫైటర్.. పాజిటివ్ రియాక్షన్లతో అదరగొడుతున్న హాలీవుడ్ చిత్రం! బాధ్యతలు చేపట్టిన జడ్పీ సీఈవో నర్సాపూర్‌లో తీవ్ర విషాదం.. మండీ బిర్యానీ తిని యువకుడు మృతి యాసంగిలో వరికి బదులు పప్పుధాన్యాలు సాగు చేయాలి 4 కోట్లతో పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి నారాయణ షూటింగ్ సెట్‌లో పెను ప్రమాదం.. తృటిలో ప్రాణాలతో బయటపడిన బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ! వైసీపీకి ఓటమి భయం... అందుకే ఆరాటం--- మంత్రి నారాయణ ప్రాణాపాయ పరిస్థితుల్లో గ్రామీణ వైద్యుల ప్రథమ చికిత్స కీలకం టాలీవుడ్ వర్గాలకు గుడ్‌న్యూస్.. ఏపీ నంది అవార్డుల దరఖాస్తు గడువు పొడిగింపు! పోలింగ్ బూతలను పరిశీలించిన కమిషనర్ సిపిఎం నాయకులతో ప్రసన్న కుమార్ రెడ్డి భేటీ "మొలక పోలేరమ్మ"కు ప్రత్యేక పూజలు రూ. 500 కోట్ల క్లబ్‌లో అజయ్ దేవగన్ దృశ్యం 3.. అయినప్పటికీ పార్ట్ 4 లేదంటూ డైరెక్టర్ క్లారిటీ! స్వశక్తితో మహిళలు ఆర్ధికంగా అభివృద్ధి చెందాలి :ఎమ్యెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి అధికార పక్షమైనా.. ప్రతిపక్షమైనా అభివృద్ధిలో వివక్ష లేదు

సర్దుబాటుపై కుస్తీపట్లు

Select Suryaa Now
సర్దుబాటుపై కుస్తీపట్లు

అమరావతి, సూర్య ప్రధాన ప్రతినిధి :ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేళ కూటమిలో సీట్ల సర్దుబాటు కసరత్తు తుది దశకు చేరింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంలో జనసేన నేతలతో సుదీర్ఘంగా చర్చలు జరుగుతున్నాయి. దాదాపు 3 గంటలుగా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల కేటాయింపుపై తీవ్ర కసరత్తు కొనసాగుతోంది.
ఈ చర్చల సరళిని, పురోగతిని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు వివరించేందుకు ఆ పార్టీ నేత, మంత్రి నాదెండ్ల మనోహర్ వెళ్లారు. పవన్ కల్యాణ్‌తో చర్చించి ఆయన అభిప్రాయాలు, మార్గదర్శకాలను తెలుసుకున్న తర్వాత నాదెండ్ల మనోహర్ మరోసారి సీఎం చంద్రబాబును కలిసి తుది జాబితాపై భేటీ కానున్నారు.
ఇదిలా ఉంటే, ఈ పొత్తులో భాగంగా జనసేన పార్టీ రాష్ట్రవ్యాప్తంగా 6 కార్పొరేషన్లు, 40 మున్సిపాలిటీలను కేటాయించాలని గట్టి పట్టుపట్టింది. అయితే, కొన్ని స్థానాలపై టీడీపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటంతో సీట్ల సర్దుబాటుపై సందిగ్ధత వీడలేదు. నేతల మధ్య జరుగుతున్న ఈ తాజా సమావేశాలతో ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.