రేణిగుంట ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు
రేణిగుంట ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు
21 స్థానాల్లో, 10 మహిళలకు.. ఎస్సీలకు 5, బీసీలకు 4 స్థానాలు
రేణిగుంట మేజర్ న్యూస్: రేణిగుంట మండల (ఎంపీటీసీ) ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఖరారు చేశారు.
రేణిగుంట మండలంలో మొత్తం 21 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, వీటిలో ఎస్సీలకు 5, బీసీలకు 4, ఎస్టీలకు 1, జనరల్ కేటగిరీకి 11 స్థానాలు కేటాయించారు. మహిళలకు మొత్తం 10 స్థానాలు రిజర్వు కాగా, మిగిలిన 11 స్థానాలు పురుషులు/మహిళలు పోటీ చేయగల కేటగిరీలుగా ఉన్నాయి.
రిజర్వేషన్ల వివరాలు: ఎస్టీ కేటగిరీలో 1 స్థానం, ఎస్సీ కేటగిరీలో 5 స్థానాలు (2 మహిళలకు), బీసీ కేటగిరీలో 4 స్థానాలు (2 మహిళలకు), జనరల్ కేటగిరీలో 11 స్థానాలు (6 మహిళలకు) కేటాయించారు. గ్రామాల వారీగా రిజర్వేషన్లు: గుత్తివారిపల్లె – ఎస్సీ, వెంకటాపురం – జనరల్, కృష్ణాపురం – జనరల్, రేణిగుంట 1 – ఎస్సీ, రేణిగుంట 2 – ఎస్సీ, జీపాలెం – జనరల్ మహిళ, రేణిగుంట 3 – ఎస్సీ మహిళ, రేణిగుంట 4 – ఎస్సీ మహిళ, రేణిగుంట 5 – జనరల్, రేణిగుంట 6 – జనరల్ మహిళ, కరకంబాడి 1 – బీసీ, కరకంబాడి 2 – ఎస్టీ, కరకంబాడి 3 – జనరల్ మహిళ, మామండూరు – జనరల్ మహిళ, ఎలమండ్యం – బీసీ, సూరప్పకాశం – బీసీ మహిళ, అత్తూరు – జనరల్ మహిళ, ఆర్. మల్లవరం – జనరల్ మహిళ, గజులమండ్యం 1 – జనరల్, గజులమండ్యం 2 – బీసీ మహిళ, తూకివాకం – జనరల్ స్థానాలుగా ఖరారు చేశారు.
రిపోర్టర్: రమేష్ బాబు కొండల