BREAKING
నాట్ ఫర్ సేల్’ పాస్‌లను ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వేదికగా భారీ ధరకు విక్రయం:హెచ్‌సిఎ సభ్యులు అరెస్ట్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ విందూ ఆతిథ్యం.. ఫౌజీ హీరోయిన్ ఇమాన్వి బర్త్‌డేకి అదిరిపోయే సర్ప్‌రైజ్! వచ్చే దసరా నాటికి మొదటి దశ ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేస్తాం- ఐశ్వర్యా రాయ్‌తో యాడ్ షూటింగ్ అనుభవం.. భావోద్వేగానికి లోనైన చైల్డ్ ఆర్టిస్ట్ సోషల్ మీడియా పోస్ట్! వాల్మీకిలను సత్వరమే ఎస్టీ జాబితాలో చేర్చాలి ఎంపీటీసీ రిజర్వేషన్లలో దళితులకు అన్యాయం రాహుల్‌ గాంధీ దిష్టిబొమ్మ దహనయత్నం:అడ్డుకున్న తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు! వెల్దుర్తి మండలంలో మొత్తం 17 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. వాటి వివరాలు మరియు రిజర్వేషన్లు: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ పంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు స్థానిక షెడ్యూల్ వచ్చేసింది.. గాయత్రీ దేవిగా దర్శనమిచ్చిన బాల త్రిపుర సుందరీ దేవి నాలుగో రోజు దుర్గామాతకు పూజలు అద్దంకి విద్యుత్తు ఈఈ మస్తాన్ రావుకు SE గా పదోన్నతి రేణిగుంట ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు

చైనా, జపాన్‌లతోనే మా పోటీ

Select Suryaa Now
చైనా, జపాన్‌లతోనే మా పోటీ

హైదరాబాద్, సూర్య ప్రధాన ప్రతినిధి :2047 నాటికి భారత్‌ను ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. స్వాతంత్ర్య వందేళ్ల ఉత్సవాలను ఘనంగా జరుపుకోబోతున్న తరుణంలో గతాన్ని సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. శతజయంతి ఉత్సవాల నాటికి దేశాన్ని నంబర్ వన్ స్థానంలో నిలపాలని ప్రధాని మోడీ నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు.

తమకు అమరావతితోనో లేదా ఇతర రాష్ట్రాలతోనో ఎలాంటి పోటీ లేదని, తాము నేరుగా చైనా, జపాన్ లాంటి అగ్ర దేశాలతోనే పోటీ పడుతున్నామని సీఎం చెప్పారు. రాష్ట్రంలో కాలుష్య పరిధిలో ఉన్న పరిశ్రమలను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నామని, పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. గతంలో ఔటర్ రింగ్ రోడ్డు (ORR) నిర్మాణంతోనే హైదరాబాద్ అభివృద్ధి వేగం పుంజుకుందని, అదే రీతిలో రాజధానిలో రీజినల్ రింగ్ రోడ్డు (RRR) నిర్మాణానికి ప్రధాని హామీ ఇచ్చారని వెల్లడించారు.