నంద్యాల జిల్లా పరిషత్ సిఇఓగా బాధ్యతలు చేపట్టిన శివశంకర్
సూర్య నంద్యాల బ్యూరో:నంద్యాల జిల్లా పరిషత్ నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శివశంకర్ నియమితులయ్యారు. బుధవారం ఆయన జెడ్సీ కార్యాలయం లో బాధ్యతలు చేపట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం నాలుగు రోజుల క్రితం రాష్ట్ర సచివాలయంలో స్వచ్ఛ ఆంద్ర విభాగంలో డైరెక్టర్ గా పని చేస్తున్న ఊర్మిళాదేవిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె నాలుగు రోజుల నుంచి విధుల్లో చేరకపోవడంతో ఆమెను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె స్ధానంలో నూతన సీఈఓగా శివశంకర్ను నియమిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాంతిలాల్ దండే ఉత్తర్వులు జారీ చేశారు. బాధ్యతలు చేపట్టిన నూతన సీఈఓను నంద్యాల ఎంపిడిఓ సుగుణశ్రీతోపాలు పలువురు అధికారులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
*మధుబాబు, సూర్య బ్యూరో ఇంచార్జి, నంద్యాల జిల్లా*