BREAKING
యానాది గిరిజన కాలనీల్లో మూడు రోజుల వైద్య శిబిరాలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్న చైల్డ్ ఆర్టిస్ట్ బుల్లిరాజు రెమ్యునరేషన్.. రోజుకి ఎంత తీసుకుంటున్నాడో తెలుసా? ఎంపిపి, జెడ్పీటీసీ, ఎంపిటిసి ల రిజర్వేషన్ లు ఖరారు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్‌లతో మరో సినిమా తీయడమే నా చివరి కోరిక.. కరణ్ జోహార్ ఆసక్తికర వ్యాఖ్యలు! ఎముకల దృఢత్వానికి బీన్స్ చేసే మేలు.. అవసరమైన ముఖ్యమైన పోషకాలు ఇవే! పుల్లలచెరువు మండలంలో స్థానిక ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు ఓటీటీలోకి క్రిస్టోఫర్ నోలన్ బ్లాక్‌బస్టర్ ది ఒడిస్సీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? చిన్నగంజాం ఎస్‌ఐ సురేష్‌కు ఎమ్మెల్యే ఏలూరి శుభాకాంక్షలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - సుకుమార్ ఆర్సీ 17 కొత్త ఆఫీస్ పూజా కార్యక్రమాలు పూర్తి! శాంతియుత వాతావరణానికి ప్రజల సహకరించాలి కేటిఆర్ తో మురళీకృష్ణ యాదవ్ మూలాఖాత్ కిరాతక భార్య, ప్రియులకు ఉరిశిక్ష ట్యాంకర్ల నీటితో వరి పంటను కాపాడుకుంటున్న రైతు జాతీయ స్థాయి క్రీడలకు ఆర్ కె విద్యార్థిని ఎంపిక బెజ్జుర్‌లో భక్తిశ్రద్ధలతో నాలుగో రోజు పూజలు - అన్నదాన వితరణ

బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ జైలర్ 2 సునామీ.. సెన్సార్ పూర్తి, ప్రీవ్యూ టాక్ అదుర్స్!

Select Suryaa Now
బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ జైలర్ 2 సునామీ.. సెన్సార్ పూర్తి, ప్రీవ్యూ టాక్ అదుర్స్!

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: సౌత్ ఇండియన్ సూపర్‌స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం జైలర్ 2 కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సంచలన విజయం సాధించిన జైలర్ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని అక్టోబర్ పదిహేనే తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కావడంతో పాటు లండన్‌లో జరిగిన ప్రత్యేక ప్రివ్యూ టాక్ ట్రేడ్ వర్గాలలో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు సభ్యులు యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేశారు. సుమారు రెండు గంటల నలభై ఐదు నిమిషాల రన్ టైమ్‌తో ఈ సినిమా ఉండనుండగా, రక్తపాతానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను తొలగించాలని, అలాగే అభ్యంతరకర డైలాగ్స్‌ను మ్యూట్ చేయాలని సెన్సార్ సభ్యులు ఆదేశించారు. అయితే ఒకటి రెండు మినహా పెద్దగా ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండానే సినిమాకు క్లియరెన్స్ లభించింది. రీసెంట్‌గా లండన్‌లో ప్రదర్శించిన ప్రివ్యూ షో ద్వారా ఈ సినిమా కథాంశం మరియు టెక్నికల్ వాల్యూస్‌పై సోషల్ మీడియాలో భారీ చర్చ జరుగుతోంది.

కథ విషయానికొస్తే కొడుకు మరణం తర్వాత రిటైర్డ్ జైలర్ ముత్తువేల్ పాండ్యన్ తన కుటుంబాన్ని కాపాడుకునే క్రమంలో డ్రగ్స్ మాఫియా డాన్ మరియు ఆయన కుటుంబం నుంచి ఎదురయ్యే ప్రాణాపాయాన్ని ఎలా ఎదుర్కొన్నాడు అనేదే ప్రధాన కథాంశం. ఈ పోరాటంలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్ తో పాటు హృతిక్ రోషన్ మరియు విజయ్ సేతుపతి పాత్రలు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లనున్నాయి. ఫస్టాఫ్‌లో రజినీకాంత్ మాస్ ఎలివేషన్లు, నెల్సన్ మార్క్ కామెడీ ప్రేక్షకులను కట్టిపడేయగా, ఇంటర్వెల్ ట్విస్ట్ మరియు అనిరుధ్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయని టాక్ వినిపిస్తోంది.

మరోవైపు సెకండాఫ్‌లో వచ్చే వరుస సర్ప్రైజ్‌లు మరియు క్లైమాక్స్‌లో హృతిక్ రోషన్‌తో వచ్చే సన్నివేశాలు అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయని రివ్యూలు చెబుతున్నాయి. అయితే మొదటి భాగంతో పోలిస్తే కొన్ని ట్విస్టులు ముందుగానే ఊహించేలా ఉన్నాయనే చిన్నపాటి నెగెటివ్ టాక్ కూడా వినిపిస్తోంది. స్టార్ కాస్ట్‌ను మరింతగా ఉపయోగించుకోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ, తలైవా స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయమని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ రజినీకాంత్ ఖాతాలో మరో భారీ బ్లాక్‌బస్టర్ పడటం పక్కా అని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.