యానాది గిరిజన కాలనీల్లో మూడు రోజుల వైద్య శిబిరాలు
పలమనేరు సూర్య మేజర్ న్యూస్
యానాది గిరిజన కుటుంబాల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా రోప్స్ సంస్థ ఆధ్వర్యంలో పీఈఎస్ ఆసుపత్రి సహకారంతో దేవలంపేట, దొడ్డిపల్లి, తిమ్మయ్యగారిపల్లి గ్రామాల్లో మూడు రోజుల పాటు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారు.ఈ శిబిరాల్లో 389 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులు పంపిణీ చేశారు. పిల్లలు, మహిళలు, వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలతో పాటు ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. మొత్తం 45 మంది ప్రత్యేక వైద్యులు పాల్గొని సేవలందించారు.గిరిజన ప్రాంతాలకు వైద్య సేవలను చేరువ చేయడమే ఈ శిబిరాల లక్ష్యమని రోప్స్ సంస్థ కార్యక్రమాల నిర్వాహకులు డాక్టర్ పౌలు రాజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధికారులు, గ్రామాల ఆరోగ్య విద్యావేత్తలు, సిబ్బంది పాల్గొన్నారు.