BREAKING
90ల నాటి జ్ఞాపకాలతో హాలీవుడ్ యాక్షన్ చిత్రం ‘స్ట్రీట్ ఫైటర్’.. అక్టోబర్ 16న గ్రాండ్ రిలీజ్! హార్ముజ్ జలసంధిలో ఎరువుల సరఫరా ప్రణాళిక అమలు కాకపోతే ప్రపంచ ఆహార సంక్షోభం లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ బ్లాక్‌బస్టర్ సక్సెస్.. ఓటీటీలో రికార్డుల మోత మోగిస్తున్న హర్ష చెముడు వెబ్ సిరీస్! సెప్టెంబర్‌లో పెరిగిన అమెరికా వినియోగదారుల ధరల సూచీ నగరంలో నూతన గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రారంభం వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు గోపీచంద్ ‘భరతవర్ష’ నుంచి నవదుర్గల వైభవంగా ‘అమ్మ కదిలి వచ్చె’ సాంగ్ రిలీజ్.. ఆధ్యాత్మిక శోభలో ట్రెండింగ్! ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడిన పోప్ లియో నాగచైతన్య, దుల్కర్ లాంచ్ చేసిన ‘డోంట్ స్లీప్’ టీజర్.. హాలీవుడ్ రేంజ్‌లో సైకలాజికల్ థ్రిల్లర్! రూ.1.65 లక్షల వ్యయంతో మినీ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం బాల్యవివాహాలు సమాజానికి శాపం ఓటీటీలో తగ్గేదేలే అంటున్న స్లైస్ ఆఫ్ లైఫ్ వెబ్ సిరీస్‌లు.. దుపహియా సీజన్ 2 సరికొత్త రికార్డులు! వీఆర్ఏల సమస్యలను వెంటనే పరిష్కరించాలి సీపీఎం జిల్లా కార్యదర్శి వై. సింహారావు డిమాండ్ వెల్దుర్తి మండల ఎంపీటీసీ, వార్డు రిజర్వేషన్లపై ఎమ్మార్పీఎస్ తీవ్ర అభ్యంతరం సందీప్ కిషన్ ‘కరికాల’ మూవీలోకి గాయత్రి భరద్వాజ్.. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో క్రేజీ రోల్!

గంగవరం బీసీ కాలనీలో వర్షపు నీటి సమస్యకు పరిష్కారం

Select Suryaa Now
గంగవరం బీసీ కాలనీలో వర్షపు నీటి సమస్యకు పరిష్కారం

పుల్లలచెరువు మేజర్ న్యూస్ ;వర్షం కురిస్తే రాకపోకలకు ఇబ్బందులు పడుతున్న గ్రామస్తుల సమస్యను గుర్తించిన టీడీపీ మాజీ మండల అధ్యక్షుడు పల్లపాటి బాదరయ్య తన సొంత నిధులతో రెండు తూరలను ఏర్పాటు చేయించి తన ఉదారతను చాటుకున్నారు. పుల్లలచెరువు మండలం గంగవరం గ్రామంలోని బీసీ కాలనీలో వర్షపు నీటి ప్రవాహం కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి ఆయన ఈ చర్య చేపట్టారు.వర్షాకాలంలో నీరు ప్రవహించే మార్గాల వద్ద రాకపోకలకు అంతరాయం కలుగుతుండటంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు తూరల ఏర్పాటు అవసరమని భావించిన బాదరయ్య, ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూడకుండా తన సొంత ఖర్చులతో రెండు తూరలను ఏర్పాటు చేయించారు. దీంతో వర్షపు నీటి ప్రవాహం వల్ల ప్రజలకు ఎదురయ్యే ఇబ్బందులు కొంతమేర తగ్గనున్నాయి.గ్రామాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు నాయకులు చొరవ చూపడం అభినందనీయమని స్థానికులు పేర్కొంటున్నారు. ప్రజల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి వ్యక్తిగతంగా ముందుకు రావడం ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుందని అభిప్రాయపడుతున్నారు.తమ ఇబ్బందులను గుర్తించి స్పందించి, సొంత నిధులతో తూరలు ఏర్పాటు చేయించిన పల్లపాటి బాదరయ్యకు గంగవరం గ్రామస్తులు కృతజ్ఞతలు తెలుపుతూ అభినందనలు వ్యక్తం చేస్తున్నారు.