గుండెమడకల పొగాకు రైతులు, సిబ్బందికి శిక్షణ మరియు అవగాహన సదస్సు
వింజమూరు మేజర్ న్యూస్ : మండలంలోనిగుండెమడకల గ్రామంలో పొగాకు బోర్డు - డి.సి.పల్లి (భారత ప్రభుత్వం: వాణిజ్య మంత్రిత్వ శాఖ, వేలం నిర్వహణ కేంద్రం - 29) ఆధ్వర్యంలో "రైతు మరియు సిబ్బంది శిక్షణా శిబిరము" తో పాటు "పొగాకు ఉత్పత్తి నియంత్రణ మరియు ప్రత్యామ్నాయ పంటలు" అనే అంశాలపై విస్తృత అవగాహన సదస్సును ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిసిపల్లి వేలం నిర్వహణ అధికారి కే సునీల్ కుమార్ విజయ్ కుమార్ ఆదర్శ జగన్నాథం ఐటిసి ప్రతినిధి హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.
సదస్సులోని ముఖ్య విషయాలు మరియు శిక్షణ వివరాలను తెలియజేశారు
పొగాకు నారుమళ్ల పెంపకంలో జాగ్రత్తలు : నాణ్యమైన, ఆరోగ్యవంతమైన నారు పొగాకు పంట అధిక దిగుబడికి పునాది అని అధికారులు వివరించారు.
వర్షపు నీరు నిలవని ఎత్తైన నారుమడులు రైజ్డ్ బెడ్స్ తయారు చేసుకోవడం, వరి ఊకతో నారుమడి శుద్ధి, మరియు సమతులాహార ఎరువుల మోతాదుల వినియోగంపై రైతులకు స్పష్టమైన సూచనలు అందించారు.
సమగ్ర నాట్లు మరియు సస్యరక్షణ విధానాలు : పొగాకు నాట్లు వేసే సమయంలో తీసుకోవాల్సిన దూరం, సరైన తేమ నిర్వహణ మరియు అంతరసేద్యం (ఇంటర్ కల్టివేషన్ )ప్రాముఖ్యతను వివరించారు. అంతేకాకుండా నారుమడి మరియు ప్రధాన పొలంలో వచ్చే నారు కుళ్ళు తెగులు, రసం పీల్చే పురుగులు, లద్దె పురుగుల నివారణకు సిఫార్సు చేసిన పురుగు మందులను మాత్రమే సరైన పరిమాణంలో వాడాలని సూచించారు.
ఎరువుల యాజమాన్యం & సమగ్ర పోషక యాజమాన్యం : నేల స్వభావాన్ని బట్టి నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులను సమతుల్యంగా వాడాలని, సేంద్రీయ ఎరువులు మరియు పశువుల ఎరువు వినియోగాన్ని పెంచాలని తెలియజేశారు
పొగాకు ఉత్పత్తి నియంత్రణ & ప్రత్యామ్నాయ పంటలు : పొగాకు బోర్డు అనుమతించిన కోటా పరిమితులకు లోబడి మాత్రమే సాగు చేపట్టి, అధిక ఉత్పత్తి కాకుండా నియంత్రణ పాటించాలని సూచించారు.
మార్కెట్ డిమాండ్, లాభసాటి ఆదాయం మరియు భూసార పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ పంటల సాగు విధానాల పట్ల అవగాహన పెంచుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు. ఈ శిక్షణా శిబిరం మరియు అవగాహన సదస్సులో అధికారులు, కంపెనీ ప్రతినిధులు మరియు ఫీల్డ్ సిబ్బంది రైతు నాయకుడు గాలి నరసపనాయుడు సిబ్బంది: విజయ్, రాము, సింహాద్రి, వైష్ణవి తదితర ఫీల్డ్ సిబ్బంది. ఉండే మండలం మరియు పరిసర గ్రామాల కు చెందిన రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.