BREAKING
వీధి కుక్కల నియంత్రణకు మున్సిపాలిటీ ప్రత్యేక చర్యలు సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘జైలర్ 2’ చిత్రంలో విద్యాబాలన్ కీలక పాత్ర.. సౌత్ సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు! సమాచార హక్కు చట్టం–2005పై అవగాహన కార్యక్రమం పులిగడ్డ వారధి కోసం 49 రోజులు నిరాహార దీక్ష.. విమలాదేవి కన్నుమూత ఆడియన్స్‌కు గొప్ప థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమా ‘హైందవ’.. హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్! స్థానిక పోరుకు సీపీఐ సై మంచినీటి సరఫరాకు అంతరాయం దాతల సహకారంతో పార్క్‌ను సుందరీకరించాలి అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఛైర్మన్‌కు ఫిర్యాదు స్థానిక పోరుకు సిద్ధం కావాలి టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్ బెల్లంకొండ శ్రీనివాస్ ‘హైందవ’ పవర్‌ఫుల్ టీజర్ రిలీజ్.. డివైన్ అండ్ యాక్షన్ థ్రిల్లర్‌గా సరికొత్త రికార్డులు! గొంతులో బాటిల్ మూత ఇరుక్కుని తొమ్మిది నెలల చిన్నారి మృతి ఆళ్లగడ్డలో ఎన్నికలు కోడ్ అమలు కదిరిబాబురావు కళాశాల విద్యార్థుల స్వచ్ఛభారత్

సంగారెడ్డి పట్టణ టీఎన్జీవోస్ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

Select Suryaa Now
సంగారెడ్డి పట్టణ టీఎన్జీవోస్ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

సంగారెడ్డి,: సంగారెడ్డి పట్టణ టీఎన్జీవోస్ సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణ, ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు.జేఏసీ చైర్మన్ మహమ్మద్ జావిద్ అలీ, టీఎన్జీవోస్ కార్యదర్శి వేల్పూరు రవి అధ్యక్షతన నిర్వహించిన ఎన్నికల కార్యక్రమానికి టీఎన్జీవోస్ అసోసియేట్ అధ్యక్షులు వెంకట్ రెడ్డి ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ఈ సందర్భంగా సంఘం బలోపేతానికి, ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేసే విధంగా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

నూతన కార్యవర్గం వివరాలు
అధ్యక్షులు: యాదవ రెడ్డి,కార్యదర్శి: వెంకటేష్,అసోసియేట్ అధ్యక్షులు: రమేష్,కోశాధికారి: హైమద్ ఖాన్,ఉపాధ్యక్షులు: రాజు, సుజాత, నాగమణి, ప్రదీప్,సంయుక్త కార్యదర్శులు: గోపాల్, పర్వీన్ బేగం, అజాం,ఆర్గనైజింగ్ సెక్రటరీ: శ్రావణి,సంఘం సభ్యులు: వసీమ, హైమద్, కిరణ్, యాదయ్య, లావణ్య, లతా, పజిల్ హైమద్, అజయ్, మునవర్, ఇమ్రాన్ ఖాన్.
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి..
ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు యాదవ రెడ్డి  మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం, ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, సంక్షేమ కార్యక్రమాల అమలు, సంఘటిత శక్తిని మరింత బలోపేతం చేయడం నూతన కార్యవర్గం ప్రధాన లక్ష్యాలని పేర్కొన్నారు. ఉద్యోగులందరినీ సమన్వయం చేసుకుంటూ వారి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.ఉద్యోగుల మధ్య ఐక్యత, పరస్పర సహకారం, సంఘం అభివృద్ధికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో సంఘం కీలక పాత్ర పోషించాలని, ఉద్యోగుల ప్రయోజనాల పరిరక్షణకు సమష్టిగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తాం..
నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన నాయకులకు, ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ, సంఘం అభివృద్ధికి అంకితభావంతో కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఉద్యోగుల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటామని తెలిపారు.ఈ ఎన్నికల కార్యక్రమంలో జిల్లా అసోసియేట్ అధ్యక్షులు కసిని శ్రీకాంత్, కోశాధికారి శ్రీనివాస్, కృష్ణ, సుధామణి, నాగేశ్వరరావు, మల్లికార్జున్, రషీద్, షరీఫ్ తదితర ఉద్యోగులు పాల్గొన్నారు.