andhrapradesh
పులిగడ్డ వారధి కోసం 49 రోజులు నిరాహార దీక్ష.. విమలాదేవి కన్నుమూత
అవనిగడ్డ, మేజర్ న్యూస్: కృష్ణా-గుంటూరు జిల్లాలను కలిపే పులిగడ్డ–పెనుమూడి వారధి నిర్మాణం కోసం 49 రోజుల పాటు రిలే నిరాహార దీక్ష చేసిన దుట్టా విమలాదేవి (92) బుధవారం మృతి చెందారు. అవనిగడ్డ మండలం పులిగడ్డకు చెందిన ఆమె వారధి సాధన ఉద్యమంలో కీలకంగా పాల్గొన్నారు.
విమలాదేవి మృతి పట్ల అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఎమ్మెల్యే తనయుడు, యువ నాయకుడు మండలి వెంకట్రామ్ ఆమె భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆమె కుమారుడు దుట్టా యుగంధర్తో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండలి శేషు, మండలి సుధీర్, మండలి రామకోటి, భోగాది దుర్గాప్రసాద్, దుట్టా ధనసుందరరావు, దుట్టా స్వామి, దుట్టా సుబ్బారావు, దుట్టా బుజ్జి, మండలి సాంబయ్య, మండలి ప్రతాప్, మండలి చిన్నా తదితరులు పాల్గొన్నారు.✍️ అజంతా శ్రీనివాస్ అవనిగడ్డ కృష్ణాజిల్లా