జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఛైర్మన్కు ఫిర్యాదు
చౌటుప్పల్, మేజర్ న్యూస్:పట్టణంలోని జాతీయ రహదారి 65పై ఫ్లైఓవర్ నిర్మాణ పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సహస్ర ఫౌండేషన్ ఛైర్మన్ డా. చినుకని శివప్రసాద్ కోరారు. ఈ మేరకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) ఛైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్కు ఫిర్యాదు లేఖ సమర్పించారు. నిర్మాణ పనులతో ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ రద్దీ, సెంట్రల్ క్రాసింగ్ల మూసివేత, రహదారి భద్రతా సమస్యలను పరిష్కరించాలని కోరారు. సురక్షిత క్రాసింగ్లు, ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేసి, అంబులెన్సులు, ఇతర అత్యవసర వాహనాలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.