కదిరిబాబురావు కళాశాల విద్యార్థుల స్వచ్ఛభారత్
సిఎస్ పురం,మేజర్ న్యూస్,,మండలంలోని శీలంవారిపల్లె గ్రామంలో కదిరిబాబురావు వ్యవసాయ కళాశాలలో నాలుగవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు విద్యాభ్యాసంలో భాగంగా నిర్వహిస్తున్న జాతీయ సేవాపధకం కార్యక్రమంలో రెండవరోజు బుధవారం పరిసరాల పరిశుభ్రత స్వచ్ఛభారత్ స్వచ్ఛఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం కళాశాల డీన్ మోషే ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఇంచార్జి అసిస్టెంట్ ప్రొఫెసర్ పి.స్టెఫీ అధ్వర్యంలో నిర్వహించారు.ఈసందర్భంగా గ్రామంలో శుభ్రత పరిశుభ్రతపై గ్రామస్థులకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు.అనంతరం గ్రామంలో రహదారులను శుభ్రంచేసి మురుగునీరు నిల్వలు, చెత్తాచెదారం లేకుండా చేసి రహదారుల వెంబడి పిచ్చిమొక్కలు తొలగించి బ్లీచింగ్ పౌడర్ చల్లారు.ఈసందర్భంగా గ్రామస్థులతో మాట్లాడుతూ శుభ్రత పరిశుభ్రతకు ప్రతిఒక్కరు బాధ్యతగా భావించి స్వచ్ఛభారత్,స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని తెలిపి శుభ్రత పరిశుభ్రతకు తీసుకోవలసిన అంశాలను గ్రామస్థులకు వివరించారు.ఈకార్యక్రమంలో అసోసియేట్ డీన్ డాక్టర్ మోషే,వ్యవసాయ కళాశాల సిబ్బంది,విద్యార్థులు,గ్రామస్థులు పాల్గొన్నారు.