మృతుల కుటుంబాలకు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పరామర్శ
మృతుల కుటుంబాలకు బూర నర్సయ్య గౌడ్ పరామర్శ
ఆరుట్లలో రెండు కుటుంబాలకు ఓదార్పు
మండలంలోని ఆరుట్ల గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ కార్యకర్తలు శేఖర్ గౌడ్, రవి గౌడ్ల తల్లి మృతి చెందగా, ఆమె పార్థివదేహానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. అదేవిధంగా ఆరుట్లకు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు పూజారి సత్తయ్య ముదిరాజ్ మృతి వార్త తెలుసుకున్న బూర నర్సయ్య గౌడ్ ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు లచ్చి రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు వింజమూరు వెంకట్ రెడ్డి, మంచాల మండల అధ్యక్షుడు, గ్రామ ఉపసర్పంచ్ నూకం రాజు ముదిరాజ్, జిల్లా నాయకులు పాండాల జంగయ్య గౌడ్, మెండు వెంకట్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, మోహన్ రెడ్డి, మహేందర్ గౌడ్, నరేందర్ గౌడ్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.