నూతన వధూవరులను ఆశీర్వదించిన సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని
నూతన వధూవరులను ఆశీర్వదించిన సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని
చేర్యాల : చేర్యాల మండల కేంద్రానికి చెందిన రిటైర్డు ఎస్ఈ కాటం సంజీవయ్య-రిటైర్డ్ టీచర్ తేజ ల కుమారుడు సాత్విక్-సమీన ల వివాహా వేడుకలు బుధవారం వెలికట్ట పరిధిలోని పవార్ కన్వెన్షన్ హాల్ లో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వారికి శుభాకాంక్షలు తెలిపి వారి దాంపత్య జీవితం ఆనందంగా, ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గసభ్యులు మాజీ ఎమ్మెల్యే సీహెచ్ రాజారెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్, జిల్లా సమితి సభ్యులు ఈరి భూమయ్య, బూరుగు సత్తయ్య గౌడ్, వలబోజు నర్సింహా చారి, నంగి కనకయ్య, గూడెపు సుదర్శన్, గోమారపు నర్సయ్య, నంగి సత్తయ్య, బింగి పోషయ్య, ఏఐటీయూసీ ఆటో యూనియన్ అధ్యక్షులు పాల సాయిలు, మండల నాయకులు పాల్గొన్నారు.