మహంకాళి ఆలయ ఆర్చ్పై దాతల పేర్ల వివాదం..! * రూ.12 లక్షలతో ఆర్చ్ నిర్మిస్తే.. దాతగా మరో పోలీస్ అధికారి పేరు ! అసలైన దాతలకు అన్యాయం !
సికింద్రాబాద్ మేజర్ న్యూస్ : సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి దేవాలయ ఆర్కు ఏర్పాటు చేసిన నేమ్ బోర్డు వివాదాస్పదమైంది. గతంలో ఆర్చ్ నిర్మించింది ఒకరైతే ఇటీవల దాత పేరుతో మరొకరు బోర్డు ఏర్పాటు చేయడం పట్ల అసలైన దాతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి దేవాలయం దగ్గర 2002 సంవత్సరంలో అప్పటి కార్పొరేటర్లు అత్తైల్లి మల్లికార్జున్ గౌడ్, శీలం ప్రభాకర్లు రూ.12 లక్షలు వెచ్చించి అమ్మవారి ఆర్చ్ ను నిర్మించారు. అయితే గతంలో ఆర్చ్ మీద ఉజ్జయినీ మహంకాళి అమ్మవారు సికింద్రాబాద్ అని నేమ్ బోర్డు మాత్రమే దాతలు చేయించారు . ఇటీవల అందులో కొన్ని అక్షరాలు చెరిగిపోయాయి. అయితే గతంలో ఇక్కడ ఎస్సైగా పనిచేసి ప్రస్తుతం ఇన్స్పెక్టర్గా ఉన్న ఓ వ్యక్తి కొత్తగా నేమ్ బోర్డును తయారు చేయించి అర్చ్ కు దాత తానే అన్నట్లు అందులో తను తన సతీమణి పేరు రాయించారు. మాజీ కార్పొరేటర్ అత్తెల్లి మల్లికార్జున్ గౌడ్, శీలం ప్రభాకర్ కుటింబీకులు దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మహంకాళి దేవాలయ ఈవో అంబుజా దృష్టికి తీసుకొని వెళ్లారు. 24 ఏళ్ల క్రితం తాము అర్చ్ ను నిర్మిస్తే సంబంధం లేని వ్యక్తి ఇలా దానిపై దాత పేరుతో ఎలా నేమ్ బోర్డు ఏర్పాటు చేస్తారని ఆమె దృష్టికి తెచ్చారు. ఈవో అంబుజా దీన్ని తొలగిస్తామని చెప్పి నాలుగు రోజులు గడిచినా పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే మహంకాళి పోలీస్ స్టేషన్లో సదరు నేమ్ బోర్డు ఏర్పాటు చేసిన పోలీసు అధికారిపై చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ధర్నా చేస్తామని హెచ్చరించారు. దీంతో దేవాలయ ఆర్చ్ నేమ్ బోర్డు వివాదాస్పదమైంది. ఇప్పటికైనా అధికారులు వివాదాస్పధమైన నేమ్ బోర్డును తొలగిస్తారా దాన్ని అలాగే ఉంచుతారా అనేది చూడాలి