BREAKING
శ్రీ చైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు బిగ్ బాస్ తెలుగు 10 ఆరో వారం ఓటింగ్ ట్రెండ్.. టాప్‌లో రోహిత్, డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు! ఆర్థిక ఆధారిత రిజర్వేషన్లకు ప్రత్యేక చట్టం తేవాలి...! విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్‌పై దాడి... సద్దుల బతుకమ్మకు కలెక్టర్‌, ఎస్పీలకు ఆహ్వానం సాగునీటి పంపిణీలో వివక్ష ఎందుకు? శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామికి అపూర్వ అష్టోత్తర శత సుదర్శన సాలగ్రామ హారం సమర్పణ బాక్సాఫీస్ వద్ద రజనీకాంత్ ‘జైలర్ 2’ మేనియా.. తొలి భాగం కథ మరియు సీక్వెల్ విశేషాలు! అధికారులకు గట్టి హెచ్చరిక భక్తిశ్రద్ధలతో అన్నదానం.. అమ్మవారిని దర్శించుకున్న భద్రారెడ్డి తిరువీధుల్లో సీతా స్వయంవరం అలంకారం! ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట -టిటిడి ఈఓ ముద్దాడ రవిచంద్ర సేవలు అభినందనీయం : చీర్ల కిరణ్ పెద్దకల్వల శివారులో గంజాయి పట్టివేత.. సింగరేణిని దోచుకుంటున్నారు.. కార్మికులను బలిచేస్తున్నారు! విద్యార్థి సంఘాల ఫిర్యాదుతో కదలిక -లా కళాశాలలను జల్లెడ పెట్టిన ఎస్వీయూ అధికారులు

గంజాయి విక్రయానికి యత్నించిన వ్యక్తి అరెస్ట్

Select Suryaa Now
 గంజాయి విక్రయానికి యత్నించిన వ్యక్తి అరెస్ట్

430 గ్రాముల గంజాయి, రెండు మొబైల్ ఫోన్లు, స్కూటీ స్వాధీనం

మొయినాబాద్ : మండలం అజీజ్‌నగర్ గ్రామంలోని శ్మశానవాటిక వద్ద గంజాయిని విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నాడనే విశ్వసనీయ సమాచారం మేరకు మొయినాబాద్ పోలీసులు ఈ రోజు ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు అందిన సమాచారం ప్రకారం, అజీజ్‌నగర్ గ్రామ శ్మశానవాటిక వద్ద గంజాయిని విక్రయించేందుకు ఒక వ్యక్తి వస్తున్నట్లు తెలియడంతో, సంబంధిత ఉన్నతాధికారులకు సమాచారం అందించి, పంచ సాక్షులు మరియు క్లూస్ టీమ్ సహకారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మధ్యాహ్నం సుమారు 12:10 గంటలకు అక్కడ అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తిని గుర్తించి, అతను పారిపోవడానికి ప్రయత్నించగా అదుపులోకి  సుకున్నారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తి అంతంగారి అరుణ్ కుమార్
విచారణలో, నిందితుడు బీదర్ ప్రాంతానికి చెందిన హుస్సేన్ అనే వ్యక్తి వద్ద గంజాయిని కొనుగోలు చేసి, మొయినాబాద్ పరిసర ప్రాంతాల్లో తన స్నేహితులకు మరియు ఇతరులకు అధిక ధరకు విక్రయిస్తున్నట్లు తెలిపినట్లు పోలీసుల పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిందితుడి వద్ద నుంచి 430 గ్రాముల ఎండు గంజాయి, గంజాయి వినియోగానికి ఉపయోగించే ప్యాకెట్లు, ఒక ఎలక్ట్రానిక్ తూకం యంత్రం, రెండు మొబైల్ ఫోన్లు మరియు TS12EB8065 రిజిస్ట్రేషన్ నంబరు గల స్కూటీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వస్తువులను పంచ సాక్షుల సమక్షంలో ప్యాక్ చేసి, గుర్తింపు గుర్తులు వేసి సీజ్ చేసినట్లు తెలిపారు.
పై విషయం లో పోలీసు వారు కేస్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మొయినాబాద్, మేజర్ న్యూస్ (అక్టోబర్ 14):