సూర్య రాజన్న సిరిసిల్ల అష్టోత్తర శత శ్రీ సుదర్శన సాలగ్రామ హారమును బుధవారం రోజున వేదమూర్తులైన బ్రహ్మోత్సవాల కరకములచే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి ముఖోల్లాసమునకై సమర్పించారు. భారతదేశంలోని ఏ దివ్య ఆలయంలో లేని విశిష్టమైన అపూర్వమైన అష్టోత్తర శత శ్రీ సుదర్శన సాలగ్రామ హారము తయారు చేయించి హైదరాబాదు నుండి తీసుకువచ్చారు.బుధవారం అట్టి హారాన్ని దేవాలయ మాడవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు.అనంతరం దేవాలయ ఆవరణలో అపురూపమైన అష్టోత్తర శత శ్రీ సుదర్శన సాలగ్రామ హారానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.భక్తుల సహకారంతో సాలగ్రామ హారాన్ని తయారు చేశారు.ఈ హారాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించారు. భక్తుల సమక్షములో విశేషంగా సంప్రోక్షణ, ఆరాధనాదులు సమర్పించి శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి వారి ముఖోల్లాసమునకై సమర్పించి అలంకరించారు.ఈ కార్యక్రమంలో మాడంరాజు కృష్ణమాచార్యులు,కార్యనిర్వాహణాధికారి మారుతీ రావు తదితరులు పాల్గొన్నారు.