అలియాబాద్లో ఘనంగా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం.. ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ శిరీష, కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్
శామీర్పేట, మేజర్ న్యూస్ (అక్టోబర్ 14): పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిరుపేదల సొంతింటి కల నెరవేరుతోందని అలియాబాద్ మున్సిపల్ చైర్మన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి, మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంకి రమేష్ అన్నారు. మేడ్చల్ నియోజకవర్గం అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని లాల్గడి మలక్పేట్ గ్రామం ఆరో వార్డుకు చెందిన కావటి సరిత–మురళి దంపతులు నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మున్సిపల్ చైర్మన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు తుంకి రమేష్ ప్రత్యేక పూజలు నిర్వహించి గృహప్రవేశ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందన్నారు. ఇల్లు లేని నిరుపేదలకు ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. సొంతింటిని నిర్మించుకున్న కావటి సరిత–మురళి దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎన్. వెంకట్ రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ తుంకి బిక్షపతి, జిల్లా కార్యదర్శి భూమిరెడ్డి నవీన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు బండరి బాబు, అబ్బాగౌని భాస్కర్ గౌడ్, చిలుగురి మల్లేష్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి, ఇప్ప మాధవ రెడ్డి, బండ సతీష్, కుంచె సత్యనారాయణ, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.