BREAKING
కొత్తగూడెం ఏరియాలో బతుకమ్మ, ఫ్యామిలీ డే వేడుకలు అనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఈ నెల 16 నుంచి 18 వరకు నామినేషన్లు.. 28న పోలింగ్, 30న ఓట్ల లెక్కింపు.. సెబీ నూతన క్లోజింగ్ ఆక్షన్ సెషన్ ఫ్రేమ్‌వర్క్: సవరించిన ట్రేడింగ్ వేళలు, వీడబ్ల్యూఏపీ నిబంధనలు, డెరివేటివ్స్ కటాఫ్ వివరాలివే! సౌదీ అరేబియా విమాన సర్వీసులపై భారత ఎంబసీ కీలక ప్రకటన: రియాద్, జెడ్డా, దమ్మామ్, మదీనా విమానాలు అక్టోబర్ 24 వరకు రద్దు! నేటి రాశి ఫలాలు – 16 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 16 అక్టోబర్ 2026 ప్రైవేట్ మూలధన సమీకరణ, ఉద్యోగాల కల్పనపై ప్రపంచ బ్యాంక్ దృష్టి సారించాలి: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం! మెహ్లీ మిస్త్రీకి అభ్యంతరాలు వ్యక్తం చేసే చట్టబద్ధమైన అర్హత లేదు: టాటా ట్రస్ట్స్ తీవ్ర అభ్యంతరం.. వివాదంలో కీలక మలుపు! సౌదీ అరేబియాలో భారత పౌరులకు కీలక సూచన: గగనతల దాడుల ముప్పు వేళ ఇళ్లలోనే ఉండాలని ఎంబసీ తాజా మార్గదర్శకాలు! అమెరికాలో హిందూ దేవాలయంపై భారీ కాల్పుల కుట్ర భగ్నం: 19 ఏళ్ల శ్వేతజాతి దురహంకారి అరెస్ట్. ఆర్సీహెచ్‌పీలో ఘనంగా శరన్నవరాత్రి పూజ నేపాల్‌లో భారత పెట్టుబడులను మరింత విస్తరించండి: భారతీయ పారిశ్రామికవేత్తలకు నేపాల్ ఆర్థిక మంత్రి ఖనాల్ పిలుపు.. వంగపల్లి గ్రామ యువకుడి హత్య...... కొత్తగూడెం కవికి దాశరథి-సినారె గజల్ పురస్కారం లక్క పల్లి లో భూ సర్వేలపై గ్రామసభ

బషీరాబాద్ విద్యార్థులకు తీపి కబురు.. జిల్లా పరిషత్ హైస్కూల్‌ తెలంగాణ పబ్లిక్ స్కూల్‌గా అప్‌గ్రేడ్‌.. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చొరవతో రూ.11 కోట్ల విడుదలకు జీవో జారీ

Select Suryaa Now
బషీరాబాద్ విద్యార్థులకు తీపి కబురు.. జిల్లా పరిషత్ హైస్కూల్‌ తెలంగాణ పబ్లిక్ స్కూల్‌గా అప్‌గ్రేడ్‌.. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చొరవతో రూ.11 కోట్ల విడుదలకు జీవో జారీ

బషీరాబాద్, మేజర్ న్యూస్: బషీరాబాద్ మండల విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తెలంగాణ పబ్లిక్ స్కూల్‌గా అప్‌గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ప్రత్యేక చొరవతో పాఠశాల అభివృద్ధి కోసం రూ.11 కోట్లు విడుదల చేస్తూ జీవో నంబర్‌ ఆర్‌టీ 180 జారీ అయినట్లు సమాచారం.ఈ నిర్ణయంతో బషీరాబాద్ మండలంలోని విద్యార్థులకు మెరుగైన విద్యా సదుపాయాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. పాఠశాలను తెలంగాణ పబ్లిక్ స్కూల్‌గా అప్‌గ్రేడ్ చేయడం ద్వారా విద్యా ప్రమాణాల పెంపునకు, అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి మార్గం సుగమం కానుంది. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చొరవతో ఈ నిర్ణయం తీసుకోవడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.