మండల పరిషత్ అధ్యక్ష పదవి రేసులో సీనియర్ టిడిపి నాయకురాలు మేఘాలాదేవి
కొయ్యలగూడెం , రూరల్ మేజర్ న్యూస్ :రాష్ట్రంలో రిజర్వేషన్ల ప్రకారం స్థానిక ఎన్నికల సందడి ప్రారంభం కావడంతో , కొయ్యలగూడెం మండల అధ్యక్ష పదవి ఓసి మహిళ రిజర్వేషన్ అవడంతో తెలుగుదేశం పార్టీ సీనియర్ మహిళ నాయకురాలు గంగిరెడ్ల మేఘాలదేవి మండల పరిషత్ అధ్యక్షురాలుగా పోటీలో కొనసాగి, మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని మండల ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. మేఘాల దేవి తెలుగుదేశం పార్టీలో మంచి మహిళ నాయకురాలుగా మండలంలో పేరు తెచ్చుకున్నారు. పరింపూడి పంచాయతీ పర్సన్ ఇన్చార్జిగా ఆమె రెండు సంవత్సరాల పాటు కొనసాగి గ్రామపంచాయతీని అభివృద్ధి పథంలో నడిపించడం జరిగింది. ఎంపీటీసీ పోటీలలో ఇద్దరు టిడిపి ఎంపీటీసీలను ఆమె గెలిపించారు. అదేవిధంగా పరింపుడి పంచాయతీ ఎస్టి రిజర్వుడు అయిన సమయంలో గ్రామానికి చెందిన పోలా సోమయ్యను టిడిపి పార్టీ తరఫునుండి అత్యధిక వందల ఓట్లతో గెలిపించడం జరిగింది. జిల్లా మహిళా అధ్యక్షురాలుగా, ఉభయగోదావరి జిల్లాల అంగన్వాడి కేంద్రాల స్టేట్ యూనియన్ సమన్వయ కర్త గా, రాష్ట్ర మహిళా ఆర్గనైజింగ్ కమిటీ సభ్యురాలుగా మేఘలాదేవి కొనసాగారు. 2021 వ సంవత్సరంలో వైసిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జడ్పిటిసిగా టిడిపి తరఫున పోటీలో ఆమెకు మండలం నుండి 8,500 ఓట్లు రావడం జరిగింది. అధినేత ఆదేశాల ప్రకారం ప్రచారానికి వెళ్లకపోయినా సరే ఇంటిలో కూర్చున్న ఆమెకు 8500 ఓట్లు రూపంలో ప్రజా అభిమానాన్ని ఆమె దక్కించుకున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పోలవరం నియోజకవర్గ శాసనసభ్యులుగా కూటమి పార్టీల తరఫునుండి పోటీ చేసిన చిర్రి బాలరాజు గెలుపొందడంలో కూడా పార్టీ తరపు నుండి ఆమె ప్రచారం జోరుగా కొనసాగించారు. ఈమె కుల, మతాలకు అతీతంగా, వివిధ పార్టీలలో తారతమ్యం లేకుండా మంచి నాయకురాలుగా మండలంతో పాటు నియోజకవర్గంలో , జిల్లాలో కూడా మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు ఓసి మహిళ కొయ్యలగూడెం మండల అధ్యక్షులుగా రిజర్వుడ్ కావడంతో మేఘాల దేవిని మండల పరిషత్ అధ్యక్షురాలుగా గెలిపిస్తే కొయ్యలగూడెం మండలం మరింత అభివృద్ధి చెందుతుందని, వ్యాపారస్తులు, వివిధ పార్టీల నాయకులు, ప్రజా ప్రతినిధులు, మండల ప్రజలు ఆశావాహులు వారి యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు.