దుర్గామాత ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి.. దేవరయాంజాల్లో అమ్మవారిని దర్శించుకున్న ఈటల సుష్మిత
శామీర్పేట, మేజర్ న్యూస్ (అక్టోబర్ 14): దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ కోడలు ఈటల సుష్మిత ఆకాంక్షించారు. శామీర్పేట మండలం దేవరయాంజాల్ గ్రామంలో హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాన్ని బుధవారం ఆమె సందర్శించారు.ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించి, ప్రజలందరిపై దుర్గామాత కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ 'గోల్డ్' శ్రీనివాస్ ముదిరాజ్, హనుమాన్ యూత్ ప్రతినిధులు, గ్రామ ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.