BREAKING
కొత్తగూడెం ఏరియాలో బతుకమ్మ, ఫ్యామిలీ డే వేడుకలు అనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఈ నెల 16 నుంచి 18 వరకు నామినేషన్లు.. 28న పోలింగ్, 30న ఓట్ల లెక్కింపు.. సెబీ నూతన క్లోజింగ్ ఆక్షన్ సెషన్ ఫ్రేమ్‌వర్క్: సవరించిన ట్రేడింగ్ వేళలు, వీడబ్ల్యూఏపీ నిబంధనలు, డెరివేటివ్స్ కటాఫ్ వివరాలివే! సౌదీ అరేబియా విమాన సర్వీసులపై భారత ఎంబసీ కీలక ప్రకటన: రియాద్, జెడ్డా, దమ్మామ్, మదీనా విమానాలు అక్టోబర్ 24 వరకు రద్దు! నేటి రాశి ఫలాలు – 16 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 16 అక్టోబర్ 2026 ప్రైవేట్ మూలధన సమీకరణ, ఉద్యోగాల కల్పనపై ప్రపంచ బ్యాంక్ దృష్టి సారించాలి: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం! మెహ్లీ మిస్త్రీకి అభ్యంతరాలు వ్యక్తం చేసే చట్టబద్ధమైన అర్హత లేదు: టాటా ట్రస్ట్స్ తీవ్ర అభ్యంతరం.. వివాదంలో కీలక మలుపు! సౌదీ అరేబియాలో భారత పౌరులకు కీలక సూచన: గగనతల దాడుల ముప్పు వేళ ఇళ్లలోనే ఉండాలని ఎంబసీ తాజా మార్గదర్శకాలు! అమెరికాలో హిందూ దేవాలయంపై భారీ కాల్పుల కుట్ర భగ్నం: 19 ఏళ్ల శ్వేతజాతి దురహంకారి అరెస్ట్. ఆర్సీహెచ్‌పీలో ఘనంగా శరన్నవరాత్రి పూజ నేపాల్‌లో భారత పెట్టుబడులను మరింత విస్తరించండి: భారతీయ పారిశ్రామికవేత్తలకు నేపాల్ ఆర్థిక మంత్రి ఖనాల్ పిలుపు.. వంగపల్లి గ్రామ యువకుడి హత్య...... కొత్తగూడెం కవికి దాశరథి-సినారె గజల్ పురస్కారం లక్క పల్లి లో భూ సర్వేలపై గ్రామసభ

తెలంగాణలో పెట్టుబడులకు పూర్తి భద్రత..

Select Suryaa Now
తెలంగాణలో పెట్టుబడులకు పూర్తి భద్రత..

హైదరాబాద్, సూర్య ప్రతినిధి :తెలంగాణలో పెట్టుబడులకు పూర్తి భద్రత ఉంటుందని, ప్రభుత్వ విధానాల్లో స్థిరత్వం నిరంతరం కొనసాగుతుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి బ్రిటన్‌కు చెందిన గ్రేట్ నార్త్ మేయర్లు, వ్యాపార, పారిశ్రామిక ప్రతినిధులకు స్పష్టం చేశారు. ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో సౌత్ యార్క్‌షైర్ మేయర్ అలివర్ కొప్పార్డ్, యార్క్ అండ్ నార్త్ యార్క్‌షైర్ మేయర్ డేవిడ్ స్కైత్, వెస్ట్ యార్క్‌షైర్ మేయర్ ట్రాసీ బ్రాబిన్ నేతృత్వంలోని బ్రిటన్ ఉన్నతస్థాయి ప్రతినిధి బృందంతో ఆయన సమావేశమయ్యారు. ఇటీవల భారత్–బ్రిటన్ మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం (CETA) నేపథ్యంలో తెలంగాణతో వాణిజ్యం, పెట్టుబడులు, విద్య, సాంస్కృతిక రంగాల్లో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంపై ఈ సందర్భంగా చర్చించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, దేశంలో అత్యంత యువ రాష్ట్రమైన తెలంగాణ అనతికాలంలోనే ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, రక్షణ, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగాల్లో ప్రపంచస్థాయిలో పోటీపడుతోందని పేర్కొన్నారు. డిసెంబర్ 7 నుంచి 9 వరకు భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న 'ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026'కు బ్రిటన్ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం రూపొందించిన ‘తెలంగాణ రైజింగ్–2047’ విజన్ డాక్యుమెంట్‌లో బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ సంస్థ నాలెడ్జ్ పార్ట్‌నర్‌గా వ్యవహరించిందని గుర్తుచేశారు. యువతలో నైపుణ్యాభివృద్ధికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించామని, త్వరలోనే 30 వేల ఎకరాల్లో నిర్మించనున్న భారత్ ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్‌ను ఆవిష్కరిస్తామని చెప్పారు. మూసీ పునరుజ్జీవం ద్వారా రివర్‌ఫ్రంట్, నైట్ ఎకానమీని విస్తరిస్తున్నామని తెలిపారు.

బ్రిటన్ ప్రతినిధులు స్పందిస్తూ, తెలంగాణలోని డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, నైపుణ్య వనరులు ఎంతో ఆకట్టుకున్నాయని, అధునాతన తయారీ, వైద్యం, ఐటీ రంగాల్లో కలిసి పనిచేసేందుకు ఆసక్తి వ్యక్తంచేశారు. అంతకుముందు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రతినిధులకు స్వాగతం పలికి జీనోమ్ వ్యాలీ పరిశీలనకు ఆహ్వానించారు. ఈ సమావేశంలో ‘UK–India CETA & Regional Synergies’ నివేదికను సీఎం ఆవిష్కరించగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సీఈవో కిషోర్ జయరామన్ తదితర అధికారులు పాల్గొన్నారు.