వెలివెలలో రూ.1.15 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభం సిమెంట్ రోడ్లకు రూ.55 లక్షలు.. గ్రావెల్ రోడ్లకు రూ.59.5 లక్షలు
పాలకొల్లు మేజర్ న్యూస్ నియోజకవర్గంలో గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా పాలకొల్లు మండలం వెలివెల గ్రామంలో రూ.1.15 కోట్లతో చేపట్టిన సిమెంట్, గ్రావెల్ రోడ్ల నిర్మాణ పనులను కూటమి నాయకులు ప్రారంభించారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కృషితో గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు కేటాయించినట్లు నాయకులు తెలిపారు. గ్రామంలోని ఆరు ప్రాంతాల్లో రూ.55 లక్షలతో సిమెంట్ రోడ్లు, రూ.59.5 లక్షలతో గ్రావెల్ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ పనులు పూర్తయితే అంతర్గత రహదారులు మెరుగుపడి ప్రజల రాకపోకలకు సౌలభ్యం కలుగుతుందని తెలిపారు.
గ్రామాల వారీగా ప్రజల అవసరాలను గుర్తించి రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిస్తూ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు కూటమి నాయకులు పేర్కొన్నారు. పాలకొల్లు నియోజకవర్గ అభివృద్ధికి మంత్రి నిమ్మల రామానాయుడు చేస్తున్న కృషిని వారు కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కోడి విజయభాస్కర్, మాజీ సర్పంచ్ కందుల వెంకటేశ్వరరావు, కండిబోయిన నాగేశ్వరరావు, కోటి రాంబాబు, దొమ్మేటి ఏసుదాసు, బోడపాటి వెంకటనారాయణ, బోడపాటి బుజ్జి, జీవి సత్యనారాయణ, మేడిది రాజబాబు, విత్తనాలు తారకరామారావు, తోకల సునీల్ బాబు, డాక్టర్ శివ, పెద్దింటి శ్రీను, రాయుడు పద్మ, ఆరేటి వరలక్ష్మి, గ్రామ ప్రజలు, ఇతర నాయకులు పాల్గొన్నారు.