BREAKING
కొత్తగూడెం ఏరియాలో బతుకమ్మ, ఫ్యామిలీ డే వేడుకలు అనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఈ నెల 16 నుంచి 18 వరకు నామినేషన్లు.. 28న పోలింగ్, 30న ఓట్ల లెక్కింపు.. సెబీ నూతన క్లోజింగ్ ఆక్షన్ సెషన్ ఫ్రేమ్‌వర్క్: సవరించిన ట్రేడింగ్ వేళలు, వీడబ్ల్యూఏపీ నిబంధనలు, డెరివేటివ్స్ కటాఫ్ వివరాలివే! సౌదీ అరేబియా విమాన సర్వీసులపై భారత ఎంబసీ కీలక ప్రకటన: రియాద్, జెడ్డా, దమ్మామ్, మదీనా విమానాలు అక్టోబర్ 24 వరకు రద్దు! నేటి రాశి ఫలాలు – 16 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 16 అక్టోబర్ 2026 ప్రైవేట్ మూలధన సమీకరణ, ఉద్యోగాల కల్పనపై ప్రపంచ బ్యాంక్ దృష్టి సారించాలి: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం! మెహ్లీ మిస్త్రీకి అభ్యంతరాలు వ్యక్తం చేసే చట్టబద్ధమైన అర్హత లేదు: టాటా ట్రస్ట్స్ తీవ్ర అభ్యంతరం.. వివాదంలో కీలక మలుపు! సౌదీ అరేబియాలో భారత పౌరులకు కీలక సూచన: గగనతల దాడుల ముప్పు వేళ ఇళ్లలోనే ఉండాలని ఎంబసీ తాజా మార్గదర్శకాలు! అమెరికాలో హిందూ దేవాలయంపై భారీ కాల్పుల కుట్ర భగ్నం: 19 ఏళ్ల శ్వేతజాతి దురహంకారి అరెస్ట్. ఆర్సీహెచ్‌పీలో ఘనంగా శరన్నవరాత్రి పూజ నేపాల్‌లో భారత పెట్టుబడులను మరింత విస్తరించండి: భారతీయ పారిశ్రామికవేత్తలకు నేపాల్ ఆర్థిక మంత్రి ఖనాల్ పిలుపు.. వంగపల్లి గ్రామ యువకుడి హత్య...... కొత్తగూడెం కవికి దాశరథి-సినారె గజల్ పురస్కారం లక్క పల్లి లో భూ సర్వేలపై గ్రామసభ

హోదా కేంద్ర మంత్రి.. ఆత్మీయతలో సామాన్య కార్యకర్త! అభివృద్ధి పనుల పర్యటనలో ఆత్మీయ మజిలీ బీజేపీ మండల అధ్యక్షుడు నాగబాబు ఇంటికి స్వయంగా వెళ్లిన భూపతిరాజు శ్రీనివాస వర్మ

Select Suryaa Now
హోదా కేంద్ర మంత్రి.. ఆత్మీయతలో సామాన్య కార్యకర్త!  అభివృద్ధి పనుల పర్యటనలో ఆత్మీయ మజిలీ  బీజేపీ మండల అధ్యక్షుడు నాగబాబు ఇంటికి స్వయంగా వెళ్లిన భూపతిరాజు శ్రీనివాస వర్మ

తణుకు, సూర్య న్యూస్ : పదవి ఎంత ఉన్నతమైనదైనా తన రాజకీయ ఎదుగుదలకు పునాదులైన కార్యకర్తలను మరువని నాయకుడిగా కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ మరోసారి వార్తల్లో నిలిచారు. అత్తిలి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విచ్చేసిన ఆయన, అధికారిక కార్యక్రమాల మధ్య భారతీయ జనతా పార్టీ అత్తిలి మండల అధ్యక్షుడు నాగబాబు గృహానికి స్వయంగా వెళ్లి కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా గడపడం విశేషంగా నిలిచింది.

కేంద్ర మంత్రి హోదాలో ఉన్నప్పటికీ ఎలాంటి అధికారిక ఆర్భాటాలకు తావులేకుండా నాగబాబు కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించిన శ్రీనివాస వర్మ, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. చిన్నారులను దగ్గరకు తీసుకుని ముచ్చటించారు. కుటుంబ సభ్యులతో కొంతసేపు గడిపిన అనంతరం పార్టీ సంస్థాగత పరిస్థితులు, క్షేత్రస్థాయిలో కార్యకర్తల పాత్ర, పార్టీ బలోపేతానికి సంబంధించిన అంశాలపై నాగబాబుతో చర్చించారు.

తాను కూడా ఒకప్పుడు సామాన్య కార్యకర్తగానే రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించానని, పార్టీ పట్ల అంకితభావంతో పనిచేస్తూ ఈ స్థాయికి చేరుకున్నానని శ్రీనివాస వర్మ వివరించారు. రాజకీయ జీవితంలో కార్యకర్తల ప్రాధాన్యాన్ని గుర్తుచేస్తూ ఆయన సాగించిన ఆత్మీయ సంభాషణ స్థానిక బీజేపీ నాయకులను ఆకట్టుకుంది.

కార్యకర్త కష్టమంటే స్పందించే ‘బీజేపీ వర్మ’..…

భూపతిరాజు శ్రీనివాస వర్మకు కార్యకర్తలతో ఉన్న అనుబంధం ఇప్పటిది కాదని పార్టీ నాయకులు చెబుతున్నారు. రాజకీయ ప్రస్థానంలో ఎన్నో సందర్భాల్లో కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలిచారని, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి చేయూతనివ్వడంతో పాటు గృహ నిర్మాణాలకు సైతం సహకరించిన సందర్భాలు ఉన్నాయని గుర్తుచేస్తున్నారు. కార్యకర్తల సమస్యలను తెలుసుకుని స్పందించే నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉందని పేర్కొంటున్నారు.

‘మా నాయకుడు.. కార్యకర్తల నాయకుడు’.…

అభివృద్ధి కార్యక్రమాలకు విచ్చేసిన కేంద్ర మంత్రి సామాన్య కార్యకర్త గృహానికి వెళ్లి కుటుంబ సభ్యులతో మమేకం కావడం పశ్చిమగోదావరి జిల్లా బీజేపీ శ్రేణుల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ‘మా నాయకుడు బీజేపీ వర్మ.. కార్యకర్తల నాయకుడు’ అంటూ పలువురు పార్టీ నాయకులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. తమ నాయకుడు కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగినా క్షేత్రస్థాయి కార్యకర్తలను ఆప్యాయంగా పలకరిస్తుండటం తమకు సంతోషాన్ని కలిగిస్తోందని అభిప్రాయపడుతున్నారు.

పదవికంటే అనుబంధానికే ప్రాధాన్యం.

ప్రజాప్రతినిధిగా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం ఒక బాధ్యత అయితే, పార్టీ కార్యకర్తలతో సాన్నిహిత్యాన్ని కొనసాగించడం మరో ముఖ్యమైన అంశమని శ్రీనివాస వర్మ అత్తిలి పర్యటన ప్రతిబింబించింది. అధికారిక కార్యక్రమాలతో తీరికలేకుండా గడిపే కేంద్ర మంత్రి, కార్యకర్త కుటుంబాన్ని పలకరించేందుకు సమయం కేటాయించడం స్థానిక పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపిందని నాయకులు పేర్కొంటున్నారు.

ఢిల్లీ స్థాయిలో బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ గ్రామస్థాయి కార్యకర్తలతో సంబంధాలను కొనసాగిస్తున్న శ్రీనివాస వర్మ వ్యవహారశైలి యువ నాయకుల్లోనూ చర్చనీయాంశమైంది. అభివృద్ధి పనులతో అత్తిలికి వచ్చిన కేంద్ర మంత్రి పర్యటనలో, కార్యకర్త కుటుంబంతో జరిగిన ఆత్మీయ కలయిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది…

రిపోర్టర్:అనుకుమార్.తణుకు. .పశ్చిమగోదావరి జిల్లా.