BREAKING
కొత్తగూడెం ఏరియాలో బతుకమ్మ, ఫ్యామిలీ డే వేడుకలు అనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఈ నెల 16 నుంచి 18 వరకు నామినేషన్లు.. 28న పోలింగ్, 30న ఓట్ల లెక్కింపు.. సెబీ నూతన క్లోజింగ్ ఆక్షన్ సెషన్ ఫ్రేమ్‌వర్క్: సవరించిన ట్రేడింగ్ వేళలు, వీడబ్ల్యూఏపీ నిబంధనలు, డెరివేటివ్స్ కటాఫ్ వివరాలివే! సౌదీ అరేబియా విమాన సర్వీసులపై భారత ఎంబసీ కీలక ప్రకటన: రియాద్, జెడ్డా, దమ్మామ్, మదీనా విమానాలు అక్టోబర్ 24 వరకు రద్దు! నేటి రాశి ఫలాలు – 16 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 16 అక్టోబర్ 2026 ప్రైవేట్ మూలధన సమీకరణ, ఉద్యోగాల కల్పనపై ప్రపంచ బ్యాంక్ దృష్టి సారించాలి: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం! మెహ్లీ మిస్త్రీకి అభ్యంతరాలు వ్యక్తం చేసే చట్టబద్ధమైన అర్హత లేదు: టాటా ట్రస్ట్స్ తీవ్ర అభ్యంతరం.. వివాదంలో కీలక మలుపు! సౌదీ అరేబియాలో భారత పౌరులకు కీలక సూచన: గగనతల దాడుల ముప్పు వేళ ఇళ్లలోనే ఉండాలని ఎంబసీ తాజా మార్గదర్శకాలు! అమెరికాలో హిందూ దేవాలయంపై భారీ కాల్పుల కుట్ర భగ్నం: 19 ఏళ్ల శ్వేతజాతి దురహంకారి అరెస్ట్. ఆర్సీహెచ్‌పీలో ఘనంగా శరన్నవరాత్రి పూజ నేపాల్‌లో భారత పెట్టుబడులను మరింత విస్తరించండి: భారతీయ పారిశ్రామికవేత్తలకు నేపాల్ ఆర్థిక మంత్రి ఖనాల్ పిలుపు.. వంగపల్లి గ్రామ యువకుడి హత్య...... కొత్తగూడెం కవికి దాశరథి-సినారె గజల్ పురస్కారం లక్క పల్లి లో భూ సర్వేలపై గ్రామసభ

ఎంపీ ల్యాడ్స్ నిధులతో 28వ వార్డులో సీసీ రోడ్డు పనులు ప్రారంభం: బీజేపీ అసెంబ్లీ కోఆర్డినేటర్ వడ్ల నందు

Select Suryaa Now
ఎంపీ ల్యాడ్స్ నిధులతో 28వ వార్డులో సీసీ రోడ్డు పనులు ప్రారంభం: బీజేపీ అసెంబ్లీ కోఆర్డినేటర్ వడ్ల నందు

వికారాబాద్, మేజర్ న్యూస్ (అక్టోబర్ 14): వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 28వ వార్డులో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఎంపీ ల్యాడ్స్ నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు పనులకు బీజేపీ నాయకులు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ బీజేపీ అసెంబ్లీ కోఆర్డినేటర్, దిశ కమిటీ సభ్యుడు వడ్ల నందు, కౌన్సిలర్ లావణ్య సురేందర్ బాబు, 26వ వార్డు కౌన్సిలర్ వేణుగోపాల్‌తో పాటు పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వడ్ల నందు మాట్లాడుతూ…. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఎంపీ ల్యాడ్స్ నిధులు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి పనులు చేపట్టడం ద్వారా వార్డుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలు చెల్లించే పన్నులు, ట్రేడ్ లైసెన్సుల ద్వారా మున్సిపాలిటీ నిర్వహణ కొనసాగుతున్నందున, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం మున్సిపాలిటీ బాధ్యత అని అన్నారు.కేంద్ర ప్రభుత్వ పథకాలైన అమృత్‌ 2.0 ద్వారా రూ.12 కోట్ల నిధులతో పాటు స్వచ్ఛ భారత్ మిషన్‌ వంటి పథకాలతో మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వివరించారు. ప్రజలకు మెరుగైన రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సురేందర్ బాబు, బీజేపీ సీనియర్ నాయకులు శివరాజ్, పట్టణ బీజేపీ అధ్యక్షురాలు యాష్కీ శిరీష, పోకల సతీష్, అమర్, బీజేపీ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలు సుచరిత, నరోత్తమ్ రెడ్డి, సునీల్, వ్యాపారవేత్త రామచంద్రయ్య, బీజేపీ యువ నాయకుడు చరణ్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.