శ్రీ చైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
సూర్య తిమ్మాపూర్ ;తిమ్మాపూర్లోని శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నలాజికల్ సైన్సెస్లో బుధవారం బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యాసంస్థల చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకాగా, డైరెక్టర్ కె. నరేందర్ రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ. ప్రసాద్ రాజు బతుకమ్మ పండుగ విశిష్టతను వివరించారు. కళాశాల విభాగాధిపతులు డాక్టర్ పి. కిషోర్, డాక్టర్ వి. ప్రవీణ్, డాక్టర్ సి.హెచ్. సంపత్ రెడ్డి, డాక్టర్ పి. శ్రవణ్, జి. శ్రీనివాస్, డాక్టర్ ఎం. రామనరేష్, అకడమిక్ డీన్ డాక్టర్ జి. శ్రీనివాస్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ పి. బాలకిషన్, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ కె. చంద్రశేఖరాచారి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఎస్.పి.వి. రామకుమార్, అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.