BREAKING
ఎంపీ ల్యాడ్స్ నిధులతో 28వ వార్డులో సీసీ రోడ్డు పనులు ప్రారంభం: బీజేపీ అసెంబ్లీ కోఆర్డినేటర్ వడ్ల నందు ♍ కన్య రాశి (Virgo) Kanya Rasi Weekly Horoscope | 11 OCT 2026 - 17 OCT 2026 | కన్య రాశి వారఫలాలు | Dr. Edupuganti Padmaja Rani మెరుగైన వైద్య సేవలు అందించాలి:జిల్లా మలేరియా అధికారి డాక్టర్ కె. నాగ శ్రీనివాస్ హోదా కేంద్ర మంత్రి.. ఆత్మీయతలో సామాన్య కార్యకర్త! అభివృద్ధి పనుల పర్యటనలో ఆత్మీయ మజిలీ బీజేపీ మండల అధ్యక్షుడు నాగబాబు ఇంటికి స్వయంగా వెళ్లిన భూపతిరాజు శ్రీనివాస వర్మ బషీరాబాద్ విద్యార్థులకు తీపి కబురు.. జిల్లా పరిషత్ హైస్కూల్‌ తెలంగాణ పబ్లిక్ స్కూల్‌గా అప్‌గ్రేడ్‌.. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చొరవతో రూ.11 కోట్ల విడుదలకు జీవో జారీ రాజానగరం నియోజక వర్గంలో స్థానిక సంస్థల ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు ♌ సింహ రాశి (Leo) Simha Rasi Weekly Horoscope | 11 OCT 2026 - 17 OCT 2026 | సింహ రాశి వారఫలాలు | Dr. Edupuganti Padmaja Rani సత్యేంద్ర మేధస్సు నన్ను భయపెట్టింది.. నా జీవితంలో అతడే అత్యంత తెలివైన వ్యక్తి: ఆర్జీవీ! దుర్గామాత ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి.. దేవరయాంజాల్‌లో అమ్మవారిని దర్శించుకున్న ఈటల సుష్మిత గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌తో రైతులకు బహుళ ప్రయోజనాలు. కనకదుర్గమ్మ సేవలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అలియాబాద్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం.. ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ శిరీష, కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ వాడపల్లి వెంకన్న ఆలయ అభివృద్ధికి ప్రతిష్టమైన చర్యలు మండల పరిషత్ అధ్యక్ష పదవి రేసులో సీనియర్ టిడిపి నాయకురాలు మేఘాలాదేవి ఇంట్లో మొక్కలు పెంచడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు.. చిన్న ఇల్లు కూడా ప్రశాంతంగా మారే అరుదైన చిట్కాలు!

సాగునీటి పంపిణీలో వివక్ష ఎందుకు?

Select Suryaa Now
సాగునీటి పంపిణీలో వివక్ష ఎందుకు?

సూర్య కరీంనగర్ ప్రతినిధి  కరీంనగర్‌, చొప్పదండి నియోజకవర్గాల రైతులకు సాగునీరు అందించే విషయంలో వివక్ష చూపడం తగదని మాజీ మంత్రి, కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ అన్నారు. రైతులు వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేస్తే, కీలక సమయంలో సాగునీరు అందక పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దపల్లి ప్రాంత రైతులకు పంటలు ఉన్నట్లే కరీంనగర్‌, చొప్పదండి ప్రాంతాల రైతులకు కూడా పంటలు ఉన్నాయని, పెద్దపల్లి రైతులకే పంటలున్నాయా.. తమ ప్రాంత రైతులకు లేవా అని ప్రశ్నించారు. రైతులందరికీ సమానంగా సాగునీరు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు అధికారులపై ఉందని స్పష్టం చేశారు.సాగునీటి సమస్య పరిష్కారం కోసం గంగుల కమలాకర్‌ రైతులతో కలిసి ఎస్సారెస్పీ డీ-86 కెనాల్‌ వద్ద ఆందోళనకు దిగారు. చొప్పదండి చౌరస్తా నుంచి రైతులను ట్రాక్టర్‌లో ఎక్కించుకొని స్వయంగా ట్రాక్టర్‌ నడుపుతూ కెనాల్‌ వద్దకు చేరుకున్నారు. అక్కడ రైతులతో కలిసి నిరసన తెలిపారు. ‘మా నీళ్లు మాకే కావాలి’ అంటూ రైతులు నినాదాలు చేశారు. రెగ్యులేటరీ గేట్లు ఎత్తి సాగునీటిని విడుదల చేయాలని అధికారులను డిమాండ్‌ చేశారు. నీటిని విడుదల చేయకుంటే కెనాల్‌ బ్రిడ్జిపై నుంచి నీటిలో దూకుతానని అధికారులకు హెచ్చరిక జారీ చేశారు. రైతులకు సాగునీరు అందించే వరకు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. అనంతరం అధికారులతో చర్చలు జరిపి మోటార్లు ఆన్‌ చేసి దిగువకు 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేయించేందుకు కృషి చేశారు.

డీ-83, డీ-86 కాలువలకు నీరేది?

డీ-83, డీ-86 కాలువలకు సరిపడా నీరు అందక పంటలు ఎండిపోయే ప్రమాదం ఏర్పడిందని గంగుల కమలాకర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం జలాల రాకతో ఎస్సారెస్పీతో పాటు వివిధ రిజర్వాయర్లు, కాలువల్లో నీటి లభ్యత పెరిగిందని పేర్కొన్నారు. సాగునీటితో పాటు తాగునీరు, ఇతర అవసరాలకు నీటిని వినియోగిస్తున్నప్పుడు కరీంనగర్‌, చొప్పదండి ప్రాంతాల రైతులకు సాగునీరు అందించడంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు. తాము అదనపు నీటిని కోరడం లేదని, న్యాయంగా రావాల్సిన వాటా మేరకు సాగునీరు అందించాలని డిమాండ్‌ చేశారు. చివరి ఆయకట్టు వరకు నీరు చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులకు సాగునీరు అందించడంలో విఫలమైందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టును సమర్థంగా వినియోగించి సాగునీటి సమస్యలు తలెత్తకుండా చూడాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రైతుల సమస్యలపై కనీసం సమీక్ష నిర్వహించడం లేదని అన్నారు. గతంలో కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని పంపుహౌస్‌ల సహాయంతో రిజర్వాయర్లు, కాలువలకు తరలించి రైతులకు సాగునీరు అందించినట్లు తెలిపారు. ప్రస్తుతం రైతులు సాగునీటి కోసం ఆందోళనలు చేయాల్సి రావడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌, కరీంనగర్‌ పీఏసీఎస్‌ చైర్మన్‌ పెండ్యాల శ్యాంసుందర్‌రెడ్డి, జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అనిల్‌కుమార్‌ గౌడ్‌, చొప్పదండి మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చొక్కారెడ్డి, ఇరుకుల్ల సర్పంచ్‌ బుర్ర రమేష్‌ గౌడ్‌, మాజీ కొత్తపల్లి మండల వైస్‌ ఎంపీపీ తిరుపతి నాయక్‌, మాజీ ఉపసర్పంచ్‌ సుంకిశాల సంపత్‌రావు, కరీంనగర్‌, చొప్పదండి నియోజకవర్గాల బీఆర్ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.