BREAKING
‘తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్’కు తరలిరండి తాండూరులో రేపు పోట్లి మహారాజ్ ఆలయ పునర్నిర్మాణ పనుల ప్రారంభం.. కొత్త శోభను సంతరించుకున్న దేవాలయం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయమునకు చేరుకున్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెవెన్యూ సహాయకులు సమ్మె ముగింపు.... బాక్సాఫీస్ వద్ద తగ్గిన అజయ్ దేవగన్ ‘దృశ్యం 3’ జోరు.. ప్రపంచవ్యాప్తంగా భారీ మైలురాయి! ఎడ్ల కృష్ణా రెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అమ్మవారి మండపం వద్ద అన్న ప్రసాదం అగ్నికుల క్షత్రియ నేత కొల్లు మూర్తి మృతి బాధాకరం... వైసీపీ నేత కొల్లు త్రినాధ వర్మ.... తుల్జా భవాని మాతను దర్శించుకున్న మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ కుటుంబం నాణ్యతలో టీజీఎస్పీడీసీఎల్ రికార్డు.. సంస్థకు 4 అంతర్జాతీయ ఐఎస్ఓ గుర్తింపులు! అంబాజీపేటలో మిణుకు మిణుకు విద్యుత్ దీపాలు - సంత రోజున ప్రజల అవస్థలు ఎంపిపి,జడ్పిటిసి రేసులో టిడిపినేతలు వెంగయ్య,మాలకొండయ్య సిద్దిపేట అభివృద్ధిపై కాంగ్రెస్‌, బీజేపీకి కడుపుమంట! ఎడ్ల కృష్ణారెడ్డి కుటుంబం సభ్యుల ఆధ్వర్యంలో అమ్మవారి మండపం వద్ద ప్రసాదం గాంధీ భవన్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు కొయ్యలగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో - పేషెంట్ ప్రాణాలతో చెలగాటం

ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట -టిటిడి ఈఓ ముద్దాడ రవిచంద్ర సేవలు అభినందనీయం : చీర్ల కిరణ్

Select Suryaa Now
ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట  -టిటిడి ఈఓ ముద్దాడ రవిచంద్ర సేవలు అభినందనీయం : చీర్ల కిరణ్

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : టీటీడీ ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ, ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న 13 మంది పోటు వర్కర్ సీనియర్లకు పోటు సూపర్‌వైజర్లుగా పదోన్నతులు, కుటుంబ పెద్దలను కోల్పోయి కష్టాల్లో ఉన్న 45 మందికి కారుణ్య నియామకాలు కల్పించడం అభినందనీయమని టీటీడీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఏపీ సిపిఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు చీర్ల కిరణ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందిస్తూ వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న టీటీడీ ఈఓ ముద్దాడ రవిచంద్రకు ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. పదోన్నతులు ఉద్యోగుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయని, శ్రీవారి ప్రసాదాల తయారీలో నాణ్యత, పరిశుభ్రత, పర్యవేక్షణ ప్రమాణాలు మరింత బలోపేతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కారుణ్య నియామకాలు 45 కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించి, వారి జీవితాల్లో కొత్త ఆశలు చిగురించాయన్నారు. పదోన్నతులు, కారుణ్య నియామకాలు పొందిన వారికి అభినందనలు తెలియజేశారు.ఈ ప్రక్రియలో సహకరించిన అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓలు డా.ఎ. శరత్, ప్రభల గోపినాథ్, సీవీఎస్ఓ మురళీకృష్ణ, టీటీడీ పాలకమండలి సభ్యులకు అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలిపారు.  

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్