విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయమునకు చేరుకున్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
*రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికిన రాష్ట్ర గవర్నరు ఎస్ అబ్ధుల్ నజీర్, ఇతర ప్రముఖులు.
ఏపీ సూర్య స్టేట్ బ్యూరో అమరావతి :
ప్రత్యేక విమానంలో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయమునకు చేరుకున్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నరు ఎస్ అబ్ధుల్ నజీర్, ఇతర ప్రముఖులు ఘన స్వాగతం పలికారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో పలు కార్యక్రమాలలో పాల్గొను నిమిత్తం గన్నవరం చేరుకున్న రాష్ట్రపతికి రాష్ట్ర గవర్నర్ తో పాటు కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కమలేష్ పాశ్వాన్, రాష్ట్ర గనులు, భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం, విపత్తు నిర్వహణ మంత్రి వంగలపూడి అనిత, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్, రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తా, కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజి, జిల్లా ఎస్పీ వి. విద్యా సాగర్ నాయుడు భారత రాష్ట్రపతికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్రపతి భద్రత బలగాల నడుమ ప్రత్యేక వాహనంలో రోడ్డు మార్గాన విజయవాడకు బయలుదేరి వెళ్లారు.