BREAKING
మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ను పరామర్శించిన వైయస్సార్సీపీ వడ్డీ రఘురాం బాలికలు శక్తివంతంగా తయారు కావాలి -- నారాయణపేట సీనియర్ సివిల్ జడ్జి వింధ్య నాయక్ టిడిపిలో కార్యకర్తలకే అధిక ప్రాధాన్యత- ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఎన్.హెచ్.ఎం ఉద్యోగుల వినూత్న నిరసన -- బోడెమ్మలు వేసి బతుకమ్మకు వినతిపత్రం అందించిన మహిళలు -- నారాయణపేటలో 2వ రోజు కొనసాగిన సమ్మె జంగారెడ్డిగూడెం వార్డుల రిజర్వేషన్లు - కమిషనర్ కేవీ. రమణ పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ శంకుస్థాపన హింసాత్మక, అస్తవ్యస్త సమాజానికి బౌద్ధ ధర్మమే శరణ్యం బేతాళ సుదర్శన్ చండీదేవి అలంకారంలో వాసవీ అమ్మవారు పరిశుభ్రమైన జంగారెడ్డిగూడెం మా లక్ష్యం - ఎమ్మెల్యే రోషన్ కుమార్ సమన్వయంతోనే పల్లెల ప్రగతి.. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో కూడా మహిళలదే హవా .. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా విజయం సాధించాలి, కంభం విజయరాజు, జెట్టి స్థానిక ఎన్నికల నేపథ్యంలో కేతవరంలో పోలీసుల అవగాహన సదస్సు 2 లోగా దీపావళి బాణసంచా షాపులకు దరఖాస్తులు చేసుకోవాలి జాతీయ సరస్ మేళాలో వైద్య శిబిరాలు, ఐసీయూ విభాగం పరిశీలన

విజయవాడ ఉత్సవ్‌–2.0కు జాతీయ స్థాయి గుర్తింపు.. నగర సంస్కృతి, సంప్రదాయాలకు విశేష ప్రాచుర్యం

Select Suryaa Now
విజయవాడ ఉత్సవ్‌–2.0కు జాతీయ స్థాయి గుర్తింపు.. నగర సంస్కృతి, సంప్రదాయాలకు విశేష ప్రాచుర్యం

విజయవాడ, మేజర్ న్యూస్ : కృష్ణానది తీరంలోని పున్నమి ఘాట్ వేదికగా నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవ్‌–2.0 నగర ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటోంది. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా నిర్వహిస్తున్న ఈ వేడుకల ద్వారా విజయవాడ నగర సంస్కృతి, సంప్రదాయాలు, కళలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తోందని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. ఉత్సవాల్లో భాగంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కమలేష్ పాస్వాన్, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, కేశినేని శివనాథ్ (చిన్ని) పాల్గొని వేడుకల నిర్వహణను అభినందించారు. కేంద్ర మంత్రి కమలేష్ పాస్వాన్ మాట్లాడుతూ, విజయవాడలో దసరా వేడుకలు వైభవంగా జరుగుతున్నాయని, విజయవాడ ఉత్సవ్‌–2.0 నిర్వహణ అభినందనీయమని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షలకు అనుగుణంగా దేశంలోని వివిధ ప్రాంతాల సంస్కృతి, సంప్రదాయాలకు గుర్తింపు తీసుకురావడంలో ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొనడం సంతోషకరమన్నారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ, నగరంలోని వివిధ వర్గాల ప్రజలను భాగస్వాములుగా చేస్తూ భారీ స్థాయిలో ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. విజయవాడ దసరా వేడుకలకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడానికి నాయకులంతా సమష్టిగా కృషి చేస్తున్నారని తెలిపారు. జాతీయ సరస్ మేళా ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాల మహిళా స్వయం సహాయక సంఘాలకు తమ ఉత్పత్తులను ప్రదర్శించి, విక్రయించుకునే అవకాశాలు లభిస్తున్నాయని చెప్పారు. ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) మాట్లాడుతూ, జాతీయ సరస్ మేళాను విజయవాడకు తీసుకురావడంలో సహకరించిన కేంద్ర మంత్రి కమలేష్ పాస్వాన్‌కు నగర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీ వెలుపల ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ఈ మేళా నిర్వహించడం ప్రత్యేకమన్నారు. దీని ద్వారా డ్వాక్రా మహిళలు, గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ లభించే అవకాశం ఉందని పేర్కొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో, సొసైటీ ఫర్ వైబ్రంట్ విజయవాడ సహకారంతో ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయని చిన్ని తెలిపారు. విజయవాడ ఉత్సవ్ నిర్వాహకుల కార్యక్రమం మాత్రమే కాదని, నగర ప్రజలందరూ భాగస్వాములై జరుపుకునే ప్రజా పండుగ అని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహకారం, ప్రజాప్రతినిధుల సమష్టి కృషితో ఉత్సవాలు మరింత వైభవంగా కొనసాగుతున్నాయని తెలిపారు. రానున్న రోజుల్లో పలువురు ముఖ్యమంత్రులు ఈ వేడుకల్లో పాల్గొననున్న నేపథ్యంలో నగరానికి మరింత ప్రాచుర్యం లభిస్తుందని పేర్కొన్నారు. విజయవాడ ఉత్సవ్‌–2.0తో పాటు నిర్వహిస్తున్న జాతీయ సరస్ మేళా మహిళా సాధికారతకు, గ్రామీణ ఉత్పత్తుల ప్రోత్సాహానికి వేదికగా నిలుస్తోంది. స్థానిక కళాకారులను ప్రోత్సహించడం, నగర సంస్కృతి, సంప్రదాయాలను దేశవ్యాప్తంగా చాటిచెప్పడం ఈ వేడుకల ప్రధాన లక్ష్యాలుగా నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, చైర్మన్లు పట్టాభి, రఘురామరాజు, ఎరబోతు రమణ, తేజస్వి, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు బొండా సిద్ధార్థ, సొసైటీ ఫర్ వైబ్రంట్ విజయవాడ ప్రతినిధి ముత్తవరపు మురళి, సినీ నటులు మురళీమోహన్, రాజా రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.ఁ

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.