BREAKING
కొత్తగూడెం ఏరియాలో బతుకమ్మ, ఫ్యామిలీ డే వేడుకలు అనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఈ నెల 16 నుంచి 18 వరకు నామినేషన్లు.. 28న పోలింగ్, 30న ఓట్ల లెక్కింపు.. సెబీ నూతన క్లోజింగ్ ఆక్షన్ సెషన్ ఫ్రేమ్‌వర్క్: సవరించిన ట్రేడింగ్ వేళలు, వీడబ్ల్యూఏపీ నిబంధనలు, డెరివేటివ్స్ కటాఫ్ వివరాలివే! సౌదీ అరేబియా విమాన సర్వీసులపై భారత ఎంబసీ కీలక ప్రకటన: రియాద్, జెడ్డా, దమ్మామ్, మదీనా విమానాలు అక్టోబర్ 24 వరకు రద్దు! నేటి రాశి ఫలాలు – 16 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 16 అక్టోబర్ 2026 ప్రైవేట్ మూలధన సమీకరణ, ఉద్యోగాల కల్పనపై ప్రపంచ బ్యాంక్ దృష్టి సారించాలి: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం! మెహ్లీ మిస్త్రీకి అభ్యంతరాలు వ్యక్తం చేసే చట్టబద్ధమైన అర్హత లేదు: టాటా ట్రస్ట్స్ తీవ్ర అభ్యంతరం.. వివాదంలో కీలక మలుపు! సౌదీ అరేబియాలో భారత పౌరులకు కీలక సూచన: గగనతల దాడుల ముప్పు వేళ ఇళ్లలోనే ఉండాలని ఎంబసీ తాజా మార్గదర్శకాలు! అమెరికాలో హిందూ దేవాలయంపై భారీ కాల్పుల కుట్ర భగ్నం: 19 ఏళ్ల శ్వేతజాతి దురహంకారి అరెస్ట్. ఆర్సీహెచ్‌పీలో ఘనంగా శరన్నవరాత్రి పూజ నేపాల్‌లో భారత పెట్టుబడులను మరింత విస్తరించండి: భారతీయ పారిశ్రామికవేత్తలకు నేపాల్ ఆర్థిక మంత్రి ఖనాల్ పిలుపు.. వంగపల్లి గ్రామ యువకుడి హత్య...... కొత్తగూడెం కవికి దాశరథి-సినారె గజల్ పురస్కారం లక్క పల్లి లో భూ సర్వేలపై గ్రామసభ

హింసాత్మక, అస్తవ్యస్త సమాజానికి బౌద్ధ ధర్మమే శరణ్యం బేతాళ సుదర్శన్

Select Suryaa Now
హింసాత్మక, అస్తవ్యస్త సమాజానికి బౌద్ధ ధర్మమే శరణ్యం  బేతాళ సుదర్శన్

 

జంగారెడ్డిగూడెం-మేజర్ న్యూస్ హింసాత్మక, అస్తవ్యస్త సమాజంలో శాంతి, సమానత్వం, మానవత్వం నెలకొనాలంటే బౌద్ధ ధర్మమే శరణ్యమని భారతీయ బౌద్ధ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు బేతాళ సుదర్శన్ అన్నారు. బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధ ధర్మ స్వీకరణకు గుర్తుగా జంగారెడ్డిగూడెంలో నిర్వహించిన బౌద్ధ సమ్మేళనానికి బౌద్ధాచార్యుడు డా అలుగు ఆనంద శేఖర్ అధ్యక్షత వహించారు. 

ఈ సందర్భంగా బేతాళ సుదర్శన్ మాట్లాడుతూ, ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలో 1956 అక్టోబర్ 14వ తేదీకి విశేష ప్రాధాన్యత ఉందన్నారు. డా. బి.ఆర్. అంబేద్కర్ బౌద్ధ ధర్మాన్ని స్వీకరించిన సందర్భంగా నాగ్‌పూర్‌లో జరిగిన కార్యక్రమానికి లక్షలాది మంది హాజరయ్యారని గుర్తుచేశారు. చరిత్రకారులు ఐదు నుంచి ఆరు లక్షల మంది పాల్గొన్నట్లు పేర్కొన్నప్పటికీ, ప్రత్యక్ష సాక్షుల కథనాలు, పరిశోధనాత్మక వివరాల ప్రకారం పది లక్షల మందికి పైగా హాజరై ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు.

బౌద్ధ ధర్మంలో జ్ఞానానికి, మానవత్వానికి, భౌతిక జీవనానికి సంబంధించిన అంశాలకు ప్రాధాన్యత ఉంటుందని వివరించారు. దేవుడి పేరుతో జరిగే ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక దోపిడీకి బౌద్ధ ధర్మంలో స్థానం లేదని ఆయన స్పష్టం చేశారు. మానవుల మధ్య సమానత్వం, వివేకం, పరస్పర గౌరవం పెంపొందించడమే బౌద్ధ ధర్మంలోని ప్రధాన సందేశమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో డా. సుబ్బారావు, మల్లవరపు సత్యనారాయణ, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు సిర్రా భరత్, కలపాల రాజకుమార్, బ్యాటరీ నాగు, శివకుమార్, మొల్ల సురేష్, కోటినిస్, సత్యనారాయణ, దావీదు, గంటా రామారావు తదితరులు పాల్గొన్నారు.