జంగారెడ్డిగూడెం వార్డుల రిజర్వేషన్లు - కమిషనర్ కేవీ. రమణ
జంగారెడ్డిగూడెం, మేజర్ న్యూస్:- జంగారెడ్డిగూడెం గ్రేడ్ వన్ మున్సిపాలిటీలో ప్రధమంగా జరగనున్న ఎన్నికల్లో 32 వ వార్డులతో కౌన్సిల్ ఏర్పడుతుందని కమిషనర్ కే వెంకటరమణ బుధవారం మీడియాకు తెలిపారు. 32 వార్డులలో ఎస్సీలకు ఐదు వార్డులు రిజర్వేషన్ అయినట్లు తెలిపారు. వాటిలో ఎస్సీ జనరల్లకు 7, 8,13 వార్డులు ఉండగా ఎస్సీ మహిళకు 6, 32, ఎస్టి జనరల్ 20వ వార్డు, బీసీ జనరల్ 1,24, 25, 26,30 లు, బీసీ మహిళకు 2, 14, 15, 27, 31లు, జనరల్ మహిళలకు 3,9, 10,17,21, 22,23, 28 29 వార్డులు, ఆన్ రిజర్వడు 4,5, 11, 12, 16, 18,19 వార్డులకు సంబంధించిన జిల్లా గజట్ను జిల్లా కలెక్టర్ వ్యక్తి సెలవు విడుదల చేశారని తెలిపారు. ఎప్పటికే మున్సిపాలిటీ బీసీ మహిళకు రిజర్వ్ అయింది.
ఫోటో. మున్సిపల్ కమిషనర్ కెవి రమణ