టిడిపిలో కార్యకర్తలకే అధిక ప్రాధాన్యత- ఎమ్మెల్యే రోషన్ కుమార్
జంగారెడ్డిగూడెం, మేజర్ న్యూస్ :- తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలకు జాతీయ అధ్యక్షులు చంద్రబాబు మంత్రి నారా లోకేష్ బాబు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ అన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణ టిడిపి కార్యాలయంలో బుధవారం పట్టణ టిడిపి అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కొలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు 120 మంది వరకూ టిడిపిలో జాయిన్ అయ్యారు. వీరికి ఎమ్మెల్యే రోషన్ కుమార్ పార్టీ కండువాలు కప్పి పార్టీలో జాయిన్ చేసుకున్నారు అనంతరం ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడారు 25,28,32 వార్డులలో నాయకులు సతీష్, మాణికల నాగేశ్వరరావు, కంచర్ల గణేశులు వైసీపీ కార్యకర్తలను మోటివేట్ చేసి టిడిపిలో చేర్చి నందులకు వారిని అభినందించారు. గత రెండున్నర సంవత్సరాల కాలంలో చింతలపూడి నియోజకవర్గం, జంగారెడ్డిగూడెం పట్టణం ఏ విధంగా అభివృద్ధి చెందిందో వివరించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అందరూ సమిష్టిగా కృషి చేసి కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో టిడిపి అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, కార్యదర్శి కోనేటి చంటి, టిడిపి సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు, నంబూరి రామచంద్ర రాజు, రామలింగేశ్వరరావు, పరిమి సత్తిపండు, పెనుమర్తి రామకుమార్ తదితరులు పాల్గొన్నారు.