BREAKING
నారాయణపేటలో అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజలు నేటి రాశి ఫలాలు – 15 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 15 అక్టోబర్ 2026 మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ను పరామర్శించిన వైయస్సార్సీపీ వడ్డీ రఘురాం బాలికలు శక్తివంతంగా తయారు కావాలి -- నారాయణపేట సీనియర్ సివిల్ జడ్జి వింధ్య నాయక్ టిడిపిలో కార్యకర్తలకే అధిక ప్రాధాన్యత- ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఎన్.హెచ్.ఎం ఉద్యోగుల వినూత్న నిరసన -- బోడెమ్మలు వేసి బతుకమ్మకు వినతిపత్రం అందించిన మహిళలు -- నారాయణపేటలో 2వ రోజు కొనసాగిన సమ్మె జంగారెడ్డిగూడెం వార్డుల రిజర్వేషన్లు - కమిషనర్ కేవీ. రమణ పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ శంకుస్థాపన హింసాత్మక, అస్తవ్యస్త సమాజానికి బౌద్ధ ధర్మమే శరణ్యం బేతాళ సుదర్శన్ చండీదేవి అలంకారంలో వాసవీ అమ్మవారు పరిశుభ్రమైన జంగారెడ్డిగూడెం మా లక్ష్యం - ఎమ్మెల్యే రోషన్ కుమార్ సమన్వయంతోనే పల్లెల ప్రగతి.. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో కూడా మహిళలదే హవా .. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా విజయం సాధించాలి, కంభం విజయరాజు, జెట్టి

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా విజయం సాధించాలి, కంభం విజయరాజు, జెట్టి

Select Suryaa Now
స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా విజయం సాధించాలి,  కంభం విజయరాజు, జెట్టి

జంగారెడ్డిగూడెం-మేజర్ న్యూస్, రానున్న స్థానిక సంస్థలు, మున్సిపాలిటీ ఎన్నికలలో అన్ని స్థానాలలో వైకాపా విజయం సాధించాలని వైకాపా చింతలపూడి నియోజకవర్గ ఇన్చార్జ్ కంభంపాటి విజయరాజు, మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు జె ట్టి గురునాథరావు అన్నారు. జంగారెడ్డిగూడెంలోని గురునాథరావు కార్యాలయంలో బుధవారం మండల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు ఓరుగంటి నాగేంద్ర కుమార్ అధ్యక్షతన పార్టీ మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 

జంగారెడ్డిగూడెం మండలంలోని అన్ని గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించేలా నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.  ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో నాయకులు, కార్యకర్తలు ముందుచూపుతో వ్యవహరించి అవసరమైన పత్రాలను సక్రమంగా సమర్పించాలని అన్నారు. అధికార పక్షం నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా కార్యకర్తలు భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించిందని, ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, వైఎస్సార్‌సీపీకి మద్దతు కూడగట్టేలా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు.  జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీతో పాటు మండలంలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించి పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి విజయాన్ని కానుకగా అందించాలని అన్నారు. రైతుల సమస్యలపై పార్టీ నిరంతరం పోరాటం చేస్తోందని, రానున్న ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు.

ఈ సమావేశంలో బూత్ కమిటీ కోఆర్డినేటర్ బీవీఆర్ చౌదరి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు ముప్పిడి శ్రీనివాసరావు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి కనికళ్ళ ప్రసాద్, జిల్లా కార్యదర్శి వామిశెట్టి హరిబాబు, జిల్లా అధికార ప్రతినిధి కురు రవి, మాజీ వైస్ ఎంపీపీ నరెడ్ల బుజ్జిబాబు, పొడపాటి నందిని తదితర నాయకులు పాల్గొన్నారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.