చండీదేవి అలంకారంలో వాసవీ అమ్మవారు
జంగారెడ్డిగూడెం-మేజర్ న్యూస్ శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో 23వ దసరా మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు అమ్మవారు చండీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. టి.వి.ఏ. రామతారకం అధ్యక్షతన ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహంకాళి మధుసూదనరావు దంపతులు పూజల్లో పాల్గొన్నారు. ప్రసాద వితరణకు కర్పూరం బాలకృష్ణ, కడిమిచర్ల లక్ష్మీనారాయణ దంపతులు దాతలుగా వ్యవహరించారు. కుసుమ హరినాథ్ వస్త్రాలయం వారు అమ్మవారి అలంకరణకు చీరను సమర్పించారు. పలువురు భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.