సమన్వయంతోనే పల్లెల ప్రగతి..
బెజ్జంకి/:అధికారులు,ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి గ్రామాల్లో ప్రగతి సాధించాలని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పిలుపునిచ్చారు.బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు.వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు,సర్పంచులతో కలిసి అభివృద్ధి,ప్రజా సమస్యలపై సమీక్షించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే కవ్వంపల్లి మాట్లాడారు.ఎల్ నీనో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు ఆరు తడి పంటలను సాగు చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.రాబోయే నీటి ఎద్దడిని తట్టుకొని భూగర్భ జలాలను పెంచేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.ప్రభుత్వం ఎల్ నినో ప్రభావము,కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు జలసిరి కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు.గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందన్నారు.అభివృద్ధి పనులు,సంక్షేమ పథకాల అమలులో అధికారులు,ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలన్నారు.గ్రామాల్లో ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు.పీఏసీఎస్ ఒగ్గు దామోదర్,ప్రత్యేక అధికారి శ్రీనివాస్ గౌడ్,ఎంపీడీవో ప్రవీణ్,సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు గూడెల్లి శ్రీకాంత్,మాజీ ఏఎంసీ చైర్మన్ పులి కృష్ణ,అధికారులు,ఆయా గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.
(సూర్య బెజ్జంకి,భాస్కర్)