BREAKING
నారాయణపేటలో అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజలు నేటి రాశి ఫలాలు – 15 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 15 అక్టోబర్ 2026 మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ను పరామర్శించిన వైయస్సార్సీపీ వడ్డీ రఘురాం బాలికలు శక్తివంతంగా తయారు కావాలి -- నారాయణపేట సీనియర్ సివిల్ జడ్జి వింధ్య నాయక్ టిడిపిలో కార్యకర్తలకే అధిక ప్రాధాన్యత- ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఎన్.హెచ్.ఎం ఉద్యోగుల వినూత్న నిరసన -- బోడెమ్మలు వేసి బతుకమ్మకు వినతిపత్రం అందించిన మహిళలు -- నారాయణపేటలో 2వ రోజు కొనసాగిన సమ్మె జంగారెడ్డిగూడెం వార్డుల రిజర్వేషన్లు - కమిషనర్ కేవీ. రమణ పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ శంకుస్థాపన హింసాత్మక, అస్తవ్యస్త సమాజానికి బౌద్ధ ధర్మమే శరణ్యం బేతాళ సుదర్శన్ చండీదేవి అలంకారంలో వాసవీ అమ్మవారు పరిశుభ్రమైన జంగారెడ్డిగూడెం మా లక్ష్యం - ఎమ్మెల్యే రోషన్ కుమార్ సమన్వయంతోనే పల్లెల ప్రగతి.. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో కూడా మహిళలదే హవా .. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా విజయం సాధించాలి, కంభం విజయరాజు, జెట్టి

నారాయణపేటలో అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజలు

Select Suryaa Now
నారాయణపేటలో అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజలు

నారాయణపేట, సూర్యన్యూస్:
నారాయణపేట పట్టణంలోని వివిధ ఆలయాల్లో అమ్మవారికి నాల్గవ రోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ కాలనీలలో ప్రతిష్టించిన అమ్మవారి విగ్రహాలకు శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం ప్రత్యేక అలంకరణలు చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణంలోని శ్రీ అంబాభవాని దేవాలయంలో అమ్మవారు రాధా రాణి రూపంలో దర్శనమిచ్చారు. అదేవిధంగా అశోక్ నగర్ శ్రీ మాలలాంభిక ఆలయంలో అమ్మవారు మహాచండీ దేవి అలంకరణలో కనిపించారు. సింగారం శ్రీగిరి పీఠంపై కొలువైన భవాని మాత మహాచండీ దేవిగా, కోటకొండ కన్యకా పరమేశ్వరి ఆలయంలో వాసవి మాతను వైష్ణవి దేవిగా అలంకరించారు. లోకాయపల్లి లక్ష్మమ్మ దేవాలయంలో అమ్మవారికి కుంకుమార్చన, సింగారంలో వడి నింపుడు కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా అమ్మవారి దీక్షలు చేపట్టిన భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భక్తులకు అన్నదాన, ప్రసాద వితరణ చేపట్టారు.
-- రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్ నారాయణపేట.