పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి హాజరైన సుంకిరెడ్డి
రూ. 6లక్షల 80వేల రూపాయలతో ఆలయ నిర్మాణం అభివృద్ధికి సహకారం
ఘన స్వాగతం పలికి, కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్తులు
తలకొండపల్లి మండలం గౌరిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మాణం పూర్తి చేసుకున్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహించిన స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి మాజీ శాసనసభ్యులు జైపాల్ యాదవ్ తో కలిసి ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు TASK-C.O.O శ్రీ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డికి గ్రామస్తులు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు, ఆలయ నిర్మాణం, అభివృద్ధి కోసం రూ.6,80,000 సహకారం అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆయన అందించిన సహకారాన్ని ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ దేవాలయాలు మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువలకు ప్రతీకలని, భావితరాలకు మన సంప్రదాయాలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు, గ్రామీణ ప్రాంతాల్లో ఆలయాల అభివృద్ధికి సహకరించడం ద్వారా భక్తుల విశ్వాసాలకు అండగా నిలవడంతో పాటు సామాజిక ఐక్యతను బలోపేతం చేయవచ్చని తెలిపారు. ఈ సంకల్పంతోనే ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాలకు తన వంతు సహకారం అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కళ్యాణ్ నాయక్, ఉప సర్పంచ్ రమేష్ యాదవ్ లతో పాటు ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.
- చప్పిడి తిరుపతి, మేజర్ న్యూస్ :తలకొండపల్లి.