BREAKING
మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ను పరామర్శించిన వైయస్సార్సీపీ వడ్డీ రఘురాం బాలికలు శక్తివంతంగా తయారు కావాలి -- నారాయణపేట సీనియర్ సివిల్ జడ్జి వింధ్య నాయక్ టిడిపిలో కార్యకర్తలకే అధిక ప్రాధాన్యత- ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఎన్.హెచ్.ఎం ఉద్యోగుల వినూత్న నిరసన -- బోడెమ్మలు వేసి బతుకమ్మకు వినతిపత్రం అందించిన మహిళలు -- నారాయణపేటలో 2వ రోజు కొనసాగిన సమ్మె జంగారెడ్డిగూడెం వార్డుల రిజర్వేషన్లు - కమిషనర్ కేవీ. రమణ పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ శంకుస్థాపన హింసాత్మక, అస్తవ్యస్త సమాజానికి బౌద్ధ ధర్మమే శరణ్యం బేతాళ సుదర్శన్ చండీదేవి అలంకారంలో వాసవీ అమ్మవారు పరిశుభ్రమైన జంగారెడ్డిగూడెం మా లక్ష్యం - ఎమ్మెల్యే రోషన్ కుమార్ సమన్వయంతోనే పల్లెల ప్రగతి.. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో కూడా మహిళలదే హవా .. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా విజయం సాధించాలి, కంభం విజయరాజు, జెట్టి స్థానిక ఎన్నికల నేపథ్యంలో కేతవరంలో పోలీసుల అవగాహన సదస్సు 2 లోగా దీపావళి బాణసంచా షాపులకు దరఖాస్తులు చేసుకోవాలి జాతీయ సరస్ మేళాలో వైద్య శిబిరాలు, ఐసీయూ విభాగం పరిశీలన

అండర్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన సర్పంచ్ వట్టెల నిర్మల శ్రీశైలం యాదవ్

Select Suryaa Now
అండర్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన సర్పంచ్ వట్టెల నిర్మల శ్రీశైలం యాదవ్


తలకొండపల్లి మండలం రాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని సంగాయపల్లి గ్రామంలో 100 ఫీట్లు అండర్ డ్రైనేజీ పనులను  గ్రామ సర్పంచ్ వట్టెల నిర్మల–శ్రీశైలం యాదవ్ సంగాయపల్లి నాయకుల తో కలిసి పనులు ప్రారంభించారు. గ్రామంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడంతో పాటు, మురుగునీటి సమస్యకు పరిష్కారం చూపే లక్ష్యంతో ఈ పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా మురుగునీరు నిల్వ ఉండకుండా సరైన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్య వాతావరణం కల్పించవచ్చని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అండర్ డ్రైనేజీ వ్యవస్థ అందుబాటులోకి రావడం వల్ల గ్రామంలో మురుగునీటి నిర్వహణ సులభతరం కావడంతో పాటు పరిసరాల పరిశుభ్రతకు దోహదపడుతుందని తెలిపారు.
గ్రామ ప్రజలకు అవసరమైన మౌలిక వసతులన దశలవారీగా మెరుగుపరిచేందుకు కృషి చేస్తామని సర్పంచ్ పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కీలకమని, ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతను కాపాడేందుకు సహకరించాలని సూచించారు.
అండర్ డ్రైనేజీ పనులు ప్రారంభం కావడంతో గ్రామంలో పారిశుద్ధ్య సమస్యలు తగ్గుతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో రాంపూర్ గ్రామ సర్పంచ్ వట్టెల నిర్మల-శ్రీశైలం యాదవ్, ఉప సర్పంచ్ సప్పిడి ఆంజనేయులు, వార్డు సభ్యులు పెరుమళ్ళ నరేష్ పబ్బ రమేష్, మాజీ ఉపసర్పంచ్ రవీందర్ రెడ్డి, మాజీ వార్డు సభ్యులు వేదం ఉదయ శంకర్, అనురాధ తిరుపతయ్య, నాయకులు వెంకటరెడ్డి, యువ నాయకుడు: పబ్బ సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మేజర న్యూస్  తలకొండపల్లి, ….