రేపు వికారాబాద్‌కు శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్… ప్రజాభవన్‌లో ప్రజలకు అందుబాటులో ఉండనున్న స్పీకర్
వికారాబాద్, మేజర్ న్యూస్ (అక్టోబర్ 14): తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి, వికారాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ గురువారం (అక్టోబర్ 15) వికారాబాద్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు ఆయన అందుబాటులో ఉండనున్నారు.పర్యటనలో భాగంగా గురువారం ఉదయం 9 గంటలకు హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ మినిస్టర్ క్వార్టర్స్ నుంచి వికారాబాద్‌కు బయలుదేరుతారు. ఉదయం 11 గంటలకు వికారాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం (ప్రజాభవన్)కు చేరుకుంటారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలను కలిసి వారి సమస్యలు, వినతులను స్వీకరించనున్నారు.నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలను శాసనసభాపతి దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ వర్గాలు సూచించాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పర్యటన వివరాలను గమనించి సహకరించాలని క్యాంపు కార్యాలయం (ప్రజాభవన్), వికారాబాద్ పేర్కొంది.