2 లోగా దీపావళి బాణసంచా షాపులకు దరఖాస్తులు చేసుకోవాలి
ఏలూరు, మేజర్ న్యూస్ : దీపావళి పండుగ సందర్భముగా ఏలూరు రెవిన్యూ డివిజన్ పరిది లోని మండలాల నందు తాత్కాలికముగా దీపావళి బాణా సంచా సామాగ్రి విక్రయించుకొనుటకు తాత్కాలిక లైసెన్స్ కొరకు ధరఖాస్తు చేసుకోను నవంబర్, 2వ తేదీ లోగా తమ కార్యాలయంనకు దరఖాస్తు చేసుకోవాలని ఏలూరు రెవిన్యూ డివిజినల్ అధికారి లక్ష్మీప్రసన్న ఒక ప్రకటనలో తెలిపారు. ధరఖాస్తుతో పాటు ధరఖాస్తు దారుని ఆధార్ కార్డు, పాన్ కార్డు, చలానా ఓరిజినల్ , ధరఖాస్తుదారుడు తప్పని సరిగా జిఎస్టి చెల్లించి సదరు రసీదును జతపరచాలన్నారు. సదరు లైసెన్స్ మంజూరు విషయములో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారు ఇచ్చిన ఆదేశములు, ఉత్తర్వులును అనుసరించి లైసెన్స్ లు మంజూరు చేయబడునని ఆర్డీఓ తెలియజేసారు.