జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో కూడా మహిళలదే హవా ..
జంగారెడ్డిగూడెం, మేజర్ న్యూస్ :-జంగారెడ్డిగూడెం పురపాలక సంఘం పరిధిలో మహిళా కౌన్సిలర్లు గణనీయంగా పెరుగుతున్నారు. జంగారెడ్డిగూడెం మేజర్ పంచాయతీ నగర పంచాయతీగా ప్రధమంగా 2016వ సంవత్సరంలో అభివృద్ధి చెందింది నగర పంచాయతీ 20 వార్డులతో ఏర్పడింది. ఆ 20 వార్డులలో 12 మంది మహిళ కౌన్సిలర్లు ఉన్నారు. అనంతరం 2021లో 29 వార్డులలో మున్సిపాలిటీ ఏర్పడినప్పుడు 16 మంది మహిళా కౌన్సిలర్లు ఉన్నారు. ఇప్పుడు గ్రేడ్ వన్ మున్సిపాలిటీగా అప్గ్రేడై ప్రాప్రధమంగా గ్రేడ్ వన్ మున్సిపాలిటీలో జరుగుతున్న ఎన్నికల్లో 32 వార్డులు ఉండగా అందులో సగభాగం 16 మంది మహిళ కౌన్సిలర్ గా తిరిగి ఎన్నిక కానున్నారు. ఇదిలా ఉండగా మున్సిపాలిటీ బీసీ మహిళకు ప్రజలకు కావడంతో మున్సిపల్ చైర్పర్సన్ను ఓటర్లే నేరుగా ఎన్నుకోనున్నారు. దీంతో చైర్పర్సన్ తో సహా 17 మంది మహిళలకు గ్రేడ్ వన్ మున్సిపాలిటీలో పదవీ బాధ్యతలు లభించనున్నాయి ఈ 17 మంది ఎవరు... ఏ ఏ పార్టీ నుంచి ఎన్నిక కానున్నారో?
ఫోటో. మున్సిపాలిటీ భవనం ముఖచిత్రం