దేవాలయాల అభివృద్ధి పనులను ప్రారంభించినవిప్ నాయకర్
నరసాపురం, మేజర్ న్యూస్ :నియోజకవర్గంలోని 11 ఆలయాల్లో దేవాదాయ శాఖ నిధులతో చేపట్టనున్న పుష్కరాల అభివృద్ధి పనులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, నరసాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ బుధవారం ప్రారంభించారు. రూ.3.12 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ పనుల ద్వారా పుష్కరాల సందర్భంగా ఆలయాలకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించనున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ పుష్కరాల సందర్భంగా ఆలయాల అభివృద్ధితో పాటు భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. అభివృద్ధి పనులను నాణ్యతతో, నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి పొత్తూరి రామరాజు, రాష్ట్ర మత్స్యకార అభివృద్ధి చైర్మన్ కొల్లు పెద్దిరాజు,జిల్లా మత్స్యకార అధ్యక్షులు మైలా వసంతరావు ఏఎంసీ చైర్మన్ జక్కం శ్రీమన్నారాయణ నియోజకవర్గ జనసేన టీడీపీ బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.