BREAKING
మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ను పరామర్శించిన వైయస్సార్సీపీ వడ్డీ రఘురాం బాలికలు శక్తివంతంగా తయారు కావాలి -- నారాయణపేట సీనియర్ సివిల్ జడ్జి వింధ్య నాయక్ టిడిపిలో కార్యకర్తలకే అధిక ప్రాధాన్యత- ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఎన్.హెచ్.ఎం ఉద్యోగుల వినూత్న నిరసన -- బోడెమ్మలు వేసి బతుకమ్మకు వినతిపత్రం అందించిన మహిళలు -- నారాయణపేటలో 2వ రోజు కొనసాగిన సమ్మె జంగారెడ్డిగూడెం వార్డుల రిజర్వేషన్లు - కమిషనర్ కేవీ. రమణ పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ శంకుస్థాపన హింసాత్మక, అస్తవ్యస్త సమాజానికి బౌద్ధ ధర్మమే శరణ్యం బేతాళ సుదర్శన్ చండీదేవి అలంకారంలో వాసవీ అమ్మవారు పరిశుభ్రమైన జంగారెడ్డిగూడెం మా లక్ష్యం - ఎమ్మెల్యే రోషన్ కుమార్ సమన్వయంతోనే పల్లెల ప్రగతి.. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో కూడా మహిళలదే హవా .. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా విజయం సాధించాలి, కంభం విజయరాజు, జెట్టి స్థానిక ఎన్నికల నేపథ్యంలో కేతవరంలో పోలీసుల అవగాహన సదస్సు 2 లోగా దీపావళి బాణసంచా షాపులకు దరఖాస్తులు చేసుకోవాలి జాతీయ సరస్ మేళాలో వైద్య శిబిరాలు, ఐసీయూ విభాగం పరిశీలన

అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కూటమి ప్రాధాన్యత -- రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి

Select Suryaa Now
అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కూటమి ప్రాధాన్యత  -- రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి

ఆగిరిపల్లి, మేజర్ న్యూస్ :  ఆగిరిపల్లి మండలం నెక్కలంగొల్లగూడెం గ్రామంలో బుధవారం జీనస్ గాస్పల్ చర్చి పునఃప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాలు శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.చర్చికమిటీ సభ్యులు, పాస్టర్లు మంత్రి పార్థసారథిని ఘనస్వాగతం పలికారు.అనంతరం ఘనంగా సన్మానించి, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఆశీర్వచనాలు అందించారు.

ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ చర్చి పునఃప్రారంభోత్సవంలో పాల్గొనుట చాలా సంతోషంగా ఉందన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ శాంతి, ప్రేమ, సోదర భావంతో జీవించాలని క్రైస్తవ మతం బోధిస్తుందని పేర్కొన్నారు. దైవమార్గంలో నడుస్తూ తోటివారికి సహాయపడే గుణాన్ని అలవర్చుకోవాలని పిలుపు నిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలందరూ ఐకమత్యంతో మెలిగి, గ్రామాభివృద్ధికి పాటుపడాలని ఆకాంక్షించారు. ​రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలు ప్రజలు సంక్షేమానికి, సమానత్వానికి ప్రాధాన్యతను ఇస్తుందని,  ప్రజాసంక్షేమమే కూటమి ప్రభుత్వం ధ్యేయంగా పనిచేస్తోందని తెలిపారు. 

​ఈ కార్యక్రమంలో చర్చి ఫాదరు దైవ ప్రసాదు, ప్రజాప్రతినిధులు, చర్చి ప్రతినిధులు, పాస్టర్లు, కూటమి నాయకులు,  పాల్గొన్నారు.