♓ మీన రాశి (Pisces) Meena Rasi Weekly Horoscope | 11 OCT 2026 - 17 OCT 2026 | మీన రాశి వారఫలాలు | Dr. Edupuganti Padmaja Rani
మీన రాశి...(పూర్వాభాద్ర 4,ఉత్తరాభాద్ర 1 2 3 4,రేవతి 1 2 3 4 పాదాలు)(నామ నక్షత్రములు: దీ , దు, ఇ+, ఝ, ధా, దే, దో, చా, చి)
వారం ప్రారంభంలో ముఖ్యమైన పనులలో వాయిదాలు, ఆలస్యాలు ఇబ్బంది. వ్యక్తిగత ఆరోగ్యం, ఆత్మీయుల సహకారం అసంతృప్తి. మానసిక ప్రశాంతత తక్కువ. ఉద్వేగ పూరి తమైన ఆలోచనలని, సంతాన వర్గంతో, తోబుట్టువులు, మిత్రులతో అభిప్రాయ బేధాలను అధిగమించాలి. కమ్యూనికేషన్ అనుకూలం స్త్రీ సహకారం, వస్తు, వస్త్ర బహుమానలు లభ్యం. వారం మధ్యలో అధిక ఆధ్యాత్మిక ఆలోచనలు, వ్యక్తిగత అభివృద్ధికై మందిర దర్శనాలు ప్రశాంతతకై భగవతారాధన, పండితాశీస్సులు, ఆర్థికవృద్ధి, కుటుంబ సహకారం లభిస్తాయి. వారాంతం వృత్తిలో ఆలస్యం అవుతున్న అభివృద్ధి గౌరవం, మంచి అవకాశాలు, మాట విలువ పెరుగుతాయి. దేవి ఆరాధన మేలు.