BREAKING
నారాయణపేటలో అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజలు నేటి రాశి ఫలాలు – 15 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 15 అక్టోబర్ 2026 మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ను పరామర్శించిన వైయస్సార్సీపీ వడ్డీ రఘురాం బాలికలు శక్తివంతంగా తయారు కావాలి -- నారాయణపేట సీనియర్ సివిల్ జడ్జి వింధ్య నాయక్ టిడిపిలో కార్యకర్తలకే అధిక ప్రాధాన్యత- ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఎన్.హెచ్.ఎం ఉద్యోగుల వినూత్న నిరసన -- బోడెమ్మలు వేసి బతుకమ్మకు వినతిపత్రం అందించిన మహిళలు -- నారాయణపేటలో 2వ రోజు కొనసాగిన సమ్మె జంగారెడ్డిగూడెం వార్డుల రిజర్వేషన్లు - కమిషనర్ కేవీ. రమణ పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ శంకుస్థాపన హింసాత్మక, అస్తవ్యస్త సమాజానికి బౌద్ధ ధర్మమే శరణ్యం బేతాళ సుదర్శన్ చండీదేవి అలంకారంలో వాసవీ అమ్మవారు పరిశుభ్రమైన జంగారెడ్డిగూడెం మా లక్ష్యం - ఎమ్మెల్యే రోషన్ కుమార్ సమన్వయంతోనే పల్లెల ప్రగతి.. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో కూడా మహిళలదే హవా .. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా విజయం సాధించాలి, కంభం విజయరాజు, జెట్టి

జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ - పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్

Select Suryaa Now
జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ - పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్

విజయవాడ మేజర్ న్యూస్ : దివంగత వంగవీటి మోహనరంగా తనయుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ జనసేన పార్టీలో చేరారు. బుధవారం సాయంత్రం పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న రాధాకృష్ణకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆయనను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని స్వాగతం పలికారు. అనంతరం రాధాకృష్ణ తన అనుచరులను పవన్ కళ్యాణ్‌కు పరిచయం చేయగా, వారితో ఆయన ఆప్యాయంగా మాట్లాడి ఫొటోలు దిగారు. జనసేన పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా కలిసికట్టుగా పనిచేస్తూ, ప్రజాసేవలో సమష్టిగా ముందుకు సాగాలని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను పాల్గొన్నారు.


స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.