ముఖ్యమంత్రి సహాయ నిధిఅంద జేత
నరసాపురం రూరల్, మేజర్ న్యూస్ :మండలంలోని సీతారామపురం గ్రామానికి చెందిన గుమ్మళ్ల సత్యనారాయణ అనారోగ్యంతో చికిత్స పొందుతూ, వైద్య ఖర్చులు భరించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ని ఆశ్రయించారు.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.1,58,918 విలువైన చెక్కును బుధవారం ఎమ్మెల్యే కార్యాలయంలో బాధిత కుటుంబానికి అందజేశారు.
ప్రజలకు అవసరమైన సమయంలో అండగా నిలుస్తూ, వైద్య చికిత్సల కోసం ప్రభుత్వ సహాయం అందేలా కృషి కొనసాగుతుందని ఎమ్మెల్యే తెలిపారు.