రెవెన్యూ సహాయకులు సమ్మె ముగింపు....
ముమ్మిడివరం మేజర్ న్యూస్ గడచిన 29 రోజులుగా మా న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ముమ్మిడివరం మండల గ్రామ రెవెన్యూ సహాయకులు లు చేపట్టిన సమ్మెను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంలో సహకరించిన పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా ప్రతినిధులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు.
నిరంతర పోరాటం చేసినప్పటకి ఎలక్షన్ కోడ్ కొన్ని అనివార్య కారణాల వల్ల మరియు ప్రభుత్వ మొండి వైఖరి వల్ల ఈ సమ్మెలో మేము ఆశించిన పూర్తి విజయాన్ని సాధించలేకపోయాము.అయినప్పటికీ, మా సమస్యలను, మా ఆవేదనను మరియు మేము చేసిన నిరసన కార్యక్రమాలను ప్రతిరోజూ ప్రజల్లోకి, ప్రభుత్వ పెద్దల వద్దకు చేర్చడంలో మీడియా ప్రతినిధులు అందించిన సహకారం మరిచిపోలేనిది.
మా పోరాటానికి అండగా నిలిచి, మా గొంతుకగా మారి మా అవేదన మాఆకలి ఆక్రందన మా యొక్క కుటుంబ సభ్యుల ఆవేదన మీ ఆవేదన గా భావించిన మా ప్రతి ఒక్క పాత్రికేయ మిత్రునికి ముమ్మిడివరం మండల గ్రామ రెవెన్యూ శాఖ తరపున పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. భవిష్యత్తులో కూడా మా సమస్యల పట్ల ఇదే విధమైన సహకారాన్ని అందిస్తారని ఆశిస్తున్నాము.